సిఎం రేవంత్‌ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్‌ ఏకగ్రీవం

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. గ్రామంలో ఎస్సికి రిజర్వ్‌ అయిన సర్పంచ్‌ పదవికి మొత్తం 15 మంది పోటీ పడ్డారు.


అయితే, సర్పంచ్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. 15 మందిలో ఒకరి పేరును గ్రామ పెద్దలు సీల్డ్‌ కవర్‌లో ప్రకటించనున్నారు. ఇరోజే నామినేషన్ కు చివరి తేదీ కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఒక్కో నామినేషన్ వేయనున్నారు.

కాగా, రాష్ట్రంలో ఈసారి మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడత ఎన్నిక డిసెంబర్ 11న జరగనుంది. ఇక, డిసెంబర్ 14 రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.