ఇటీవల చదువుల కోసం లేదా ఉద్యోగం రీత్యా అమ్మాయిలు, అబ్బాయిలు నగరాలకు వెళ్తుండటం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా చాలా మంది ఎక్కువగా ఉన్నత స్టడీస్ కోసం హైదరాబాదు పట్టణాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.
చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాల కోసమైనా ఈ నగరం బాటనే పడుతున్నారు.
జాబ్/స్టడీ కోసం వెళ్లినా అమ్మాయిలు, అబ్బాయిలు ముందుగా హాస్టల్స్ లేదా రూంలో ఉండేందుకు సౌకర్యవంతమైన ప్లేస్‌ను ఎంపిక చేసుకుంటారు. ఇక హైదరాబాదులో కొన్ని కొన్ని ఏరియాల్లో అనేక గర్ల్స్ హాస్టల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుత రోజుల్లో కొన్ని హాస్టళ్ల నిర్వాకం చూస్తుంటే ఊర్లో ఉన్న తల్లితండ్రులు పిల్లల్ని హైదరాబాదు నగరానికి పంపించాలంటేనే జంకుతున్నారు. మరీ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వార్త చూసినట్లేతే..
హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. కో-లివింగ్ పీజీ హాస్టల్స్ అంటూ కుప్పలుతెప్పులుగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే.. మమ్మల్ని అరేంజ్ చేయమన్నా సరే అని స్వయంగా హాస్టల్ ఓనర్సే అంటున్నారు.
అంతేకాకుండా.. పైగా ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండొచ్చంటూ ప్రకటనలు కూడా జారీ చేస్తున్నారు. పోలీసులే మా పార్టనర్లు అని కూడా కో-లివింగ్ పీజీ హాస్టల్ ఓనర్స్ అంటుండటం గమనార్హం. ఈ నిర్వాకం ఐటెక్ సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలిసి కొందరు చేస్తుంటే.. తెలియకుండా ఈ ఉచ్చులో పడేవారు కొందరు ఉన్నారని టాక్. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.