Comedy Movie OTT : ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్ కామెడీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల ఓటీటీలోకి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. అందులో స్టార్ హీరోల సినిమాలకు ఒకప్పుడు ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్య ప్రతి ఛానల్ లో వచ్చే సినిమాలు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాలు మంచి క్రియేషన్ దక్కించుకున్నాయి అలాగే ఇప్పుడు కన్నడ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ని అందుకుంటున్నాయి. డిఫరెంట్ కథలతో ఉన్న సినిమాలను ఓటిటి సంస్థలు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ కామెడీ డ్రామా చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ మూవీ పేరేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో ఇప్పుడు చూద్దాం..


మూవీ& ఓటీటీ..

గత ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. కన్నడంలో కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఓ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ కౌసల్య సుప్రజ రామ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది.. ఈ చిత్రాన్ని ఈనెల 27న ఈటీవీ విన్ లోకి స్ట్రీమింగ్ చెయ్యనున్నారు. ఈరోజు సినిమాలో డార్లింగ్ కృష్ణ, బృంద ఆచార్య, మిలానా నాగరాజ్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2023లో కన్నడంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కామెడీ జోనర్ గా వచ్చిన ఈరోజు మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఆ ఏడాదిలో రిలీజ్ అన్నీ సినిమాల్లో కన్నా ఈ మూవీ కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా నిలిచింది. నిర్మాతలకు పది కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. శశాంక్ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించారు. డార్లింగ్ కృష్ణ, మిలానా నాగరాజ్ కలయికలో వచ్చిన ఆరవ మూవీ ఇది..

స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీ ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. మదర్ సెంటిమెంట్‌కు ట్రయాంగిల్ లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు శశాంక్ కౌసల్య సుప్రజ రామ మూవీని రూపొందించాడు. కాన్సెప్ట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డార్లింగ్ కృష్ణ యాక్టింగ్ అభిమానులను ఎంతగానో అలరించింది.. సిద్దిగౌడ్ అనే వ్యక్తి భార్య పై ఆదిపథ్యం చాలాయించే వ్యక్తిగా ఉంటారు. ఆడవాళ్లు ఇంటికే పరిమితం కావాలనే, భర్తలకు సేవ చేయడమే వారి పని నమ్ముతాడు.. ఆయన కొడుకు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అందరికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటాడు. ఆడవాళ్ల గొప్పతనాన్ని రామ్ ఎలా అర్థం చేసుకున్నాడు? భర్త మంచి మనసును ముత్తులక్ష్మి అర్థం చేసుకుందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.. కన్నడలో మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. ఇక ఈ నెల లో ఎక్కువ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. డేట్ ను లాక్ చేసుకుంటున్నాయి.