పోస్టల్‌ బ్యాలెట్‌పై.. వైసీపీలో కలవరం

www.mannamweb.com


ఉద్యోగులంతా కూటమికే ఓటేశారని అనుమానం

– జగన్‌ పాలనలో ఉద్యోగుల అణచివేత..

– ఉద్యమాలకూ అడ్డంకులే

– అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడిందని ప్రచారం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్‌బ్యాలెట్‌పై వైసీపీ నేతల్లో కలవరం రేగుతోంది. వైసీపీ పాలనలో ఉద్యోగులంతా దారుణ అణచివేతకు గురి కాగా.. ఓట్ల రూపంలో వారంతా బదులు తీర్చుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన పోస్టల్‌బ్యాలెట్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది. కాగా.. అధికశాతం మంది ఉద్యో గులు వైసీపీని వ్యతిరేకిస్తూ.. ఎన్టీయే కూటమికి ఓటేశారని.. ప్రచారం సాగుతోంది. దీంతో తమ గెలుపు కష్టమేనని వైసీపీ అభ్యర్థుల్లో నిరాశ కనిపిస్తోంది. ‘మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మరింత మేలు చేస్తా’మని గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సిం గ్‌ సిబ్బంది వైసీపీ వైపు మొగ్గు చూపారు. కాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదే ళ్లు పూర్తయింది. కానీ, ఇంతవరకూ సీపీఎస్‌ రద్దు హామీ నెరవేర్చలేదు. మరోవైపు ఎన్నడూ లేనంతగా ఉద్యోగు లను వంచనకు గురిచేశారు. హక్కులపై పోరాడితే.. ముందస్తు అరెస్ట్‌లు, గృహనిర్బంధాల పేరిట అణచివేతకు చర్య లు చేపట్టారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు మారువేషా ల్లో విజయవాడ వెళ్లి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. అలా గే అంగన్‌వాడీల ఆందోళనలను కూడా ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుంది. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదు. పీఆర్సీ సంగతే లేదు. ఆపై డీఏ బకాయిలు విడుదల కాలేదు. పీఎఫ్‌ డబ్బుల ఉపసంహరణ కూడా సక్రమంగా చెల్లించలేదు. ఉద్యోగుల యూని యన్లలో బలంగా ఉండేవి ఉపాధ్యాయ సంఘా లు మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపా ధ్యాయుల పనితీరుపై నిఘాపెట్టి వారిని అణిచివే యాలని నిర్ణయించింది. ఇటు యాప్‌ల భారం, ఆపై మ రుగుదొడ్లను ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలని చెప్పింది. బోధనేతర పనులను అప్పగించడం.. పరోక్షంగా విద్యా ప్రమాణాలు దెబ్బతీసేలా చర్యలు చేపట్టింది. దీంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంతా గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో తమను ఇబ్బందులు పెట్టిన వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాయని తెలుస్తోంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వన్‌సైడ్‌ వార్‌

2019 ఎన్నికల్లో ఏకపక్షంగానే వైసీపీకి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు సీన్‌ తారుమారైంది. ఒక్కసారి అధికారం ఇస్తే అణిచివేశారన్న కారణంతో ఇప్పుడు ఉద్యోగులు.. వైసీపీకి మరోచాన్స్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వార్‌ వన్‌సైడ్‌ మాదిరి అధికశాతం మంది ఉద్యోగులు ఎన్డీయే కూటమికి ఓటేశారనే ప్రచారం సాగుతోంది. ‘జగన్‌ సర్కారు ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టింది.. అందుకు తగిన ప్రతిఫలం ఇప్పుడు మేం ఓట్ల రూపంలో చూపాం’ అని కొంతమంది ఉద్యోగులు పరోక్షంగా వెల్లడిస్తున్నారు. ఉద్యోగుల ఓట్లు.. ఈసారి వ్యతిరేకంగా పోలయ్యే అవకాశముందని వైసీపీ ముందే పసిగట్టేసింది. అందుకే ఓట్లను గల్లంతు చేయడం… వేర్వేరు పోలింగ్‌ స్టేషన్లకు ఓటును బదిలీచేసి కొంతమేర గందరగోళం కలిగించేలా తెరవెనుక వ్యవహరించింది. అయినా ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చారు. ఓట్లు గల్లంతైనా.. గంటల సేపు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఆలస్యమైనా సరే ఓటు వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో నరసన్నపేటలో కాస్త గందరగోళమైంది. కలెక్టర్‌ కూడా అక్కడే మాటువేసి పోలింగ్‌ను పరిశీలించారు. నిర్లక్ష్యం చూపిన ముగ్గురు అధికారులకు షోకాజ్‌ నోటీసులను కూడా జారీచేశారు. ఏదిఏమైనా ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వైసీపీకి ఝలక్‌ తప్పదని పలువురు పేర్కొంటున్నారు.