అశ్వగంధ పొడిని ప్రతిరోజూ ఇలా ఉపయోగిస్తే అకాల మరణం రాదు, ఆయుష్షు పెరగడం ఖాయం

Ashwagandha Podi: అశ్వగంధ పొడిని ప్రతిరోజూ ఇలా ఉపయోగిస్తే అకాల మరణం రాదు, ఆయుష్షు పెరగడం ఖాయం
Ashwagandha Podi: ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. దీన్ని ప్రతి రోజూ తింటే ఎన్నో రకాల అనారోగ్యాలు దూరం అవుతాయి. దీనివల్ల అకాల మరణం కూడా సంభవించదు.


ఎంతోమంది అనారోగ్యాల బారినపడి అకాల మరణం బారిన పడుతున్నారు. అలాకాకుండా ఆయుష్షును పెంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ అశ్వగంధ పొడిని ఆహారంలో భాగం చేసుకోండి.

అశ్వగంధను శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో శక్తివంతమైన మూలికగా వినియోగిస్తున్నారు. దీన్ని భారతీయజిన్సింగ్ అని కూడా పిలుస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు ఎన్నో ప్రాణాంతక రోగాలు మన శరీరంలో చేరకుండా కాపాడుతుంది. ప్రతిరోజూ అశ్వగంధను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

డయాబెటిస్

అశ్వగంధను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎన్నో అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేశాయి. అశ్వగంధ డయాబెటిస్ బారిన పడిన వారిలో గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందని కొత్త అధ్యయనంలో నిరూపణ అయింది. అలాగే ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీలో కూడా మరొక అధ్యయనం అశ్వగంధ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుందని నిరూపించింది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

కండరాలకు బలం

ఎవరైతే బలమైన కండరాలు కావాలనుకుంటున్నారో వారు అశ్వగంధను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం అశ్వగంధను తీసుకున్న పురుషులు కండరబలాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు తేలింది. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి ఇన్ఫ్మమేషన్‌ను తగ్గించడంలో అశ్వగంధ మొదటి స్థానంలో ఉంటుంది. అథ్లెట్లు, ఫిట్‌నెస్‌ను ఇష్టపడేవారు దీన్ని సప్లిమెంట్లుగా వాడడం మంచిది.

సంతానోత్పత్తి ఆరోగ్యం

అశ్వగంధలో సహజ కామోద్దీపన లక్షణాలు ఉన్నాయి. ఇది సంతానోత్పత్తికి బూస్టర్‌గా ఉపయోగపడుతుంది. అశ్వగంధ పురుషులలో స్పెర్మ్ కౌంటును పెంచడమే కాదు, వాటి చలనశీలతను కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మహిళలు గర్భం ధరించే అవకాశాలను పెంచుతుంది. మహిళలు ఈ అశ్వగంధను ఆహారంగా తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి సంతానోత్పత్తి అవకాశాలు బాగా పెరుగుతాయి. శరీరం ఒత్తిడిని తట్టుకునే స్థాయికి చేరుకుంటుంది.

జ్ఞాపకశక్తికి…

ఏ వయసు వారికైనా జ్ఞాపకశక్తి చాలా ముఖ్యం. అశ్వగంధ జ్ఞాపకశక్తిని, అభిజ్ఞా పనితీరును పెంచడంలో ముఖ్యమైనది. జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం అశ్వగంధను తీసుకున్న వారిలో జ్ఞాపకశక్తి, అభిజ్ఞా నైపుణ్యాలు అధికంగా ఉన్నట్టు తేలింది. ఈ అశ్వగంధలో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు, ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వంటివి అధికంగా ఉంటాయి. నాడీ వ్యవస్థపై అశ్వగంధ మంచి ప్రభావాలను చూపిస్తుంది. మానసిక స్పష్టతను అందిస్తుంది.

గుండె ఆరోగ్యానికి

అశ్వగంధ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ లో ఒక పరిశోధన తాలూకు అంశాలను ప్రచురించారు. దీనిలో అశ్వగంధ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించినట్లు కనుగొన్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో అశ్వగంధ ముందుంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి హృదయ సంబంధ సమస్యలకు కారణం అవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మొత్తం హృదయాన్ని కాపాడేందుకు ముందుంటుంది.

అశ్వగంధను ఎలా ఉపయోగించాలి?

అశ్వగంధ లేహ్యం రూపంలో, పొడి రూపంలో, సప్లిమెంట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది. రోజుకు రెండుసార్లు అశ్వగంధను తీసుకుంటే మంచిది. వెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీళ్లలో పావు స్పూను అశ్వగంధ పొడిని కలుపుకొని తాగితే ఎంతో మంచిది. ఇక అశ్వగంధ సప్లిమెంట్లు వాడాలనుకున్నవారు ఆయుర్వేద వైద్యులను కలిసి తగిన సూచనలు తీసుకోవాలి.