వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన ‘కూలీ’

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘కూలీ’ బాక్స్ఆఫీస్ వద్ద భారీ సెన్సేషన్ ని సృష్టించింది.


ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమినీ టీవీ ఛానల్ లో అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో నాగార్జున, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్య దేవ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, మరియు రచిత రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని కంపోస్ చేసారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.