చికెన్‌తో చేసే వెరైటీలు, స్నాక్స్ అంటే ఎవరికైనా నచ్చుతాయి. చాలా మంది చికెన్‌ని ఇష్ట పడి మరీ తింటారు. అందులోనూ ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది. వేడి వేడిగా తినడానికి చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు.
ఇలా చికెన్ అంటే ఇష్టం ఉండే వాళ్లు క్రిస్పీగా చికెన్ పకోడీలు వేసుకోవచ్చు. అయితే బయట తినే టేస్ట్ ఇంట్లో చేస్తే రాదు. కానీ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఆ రుచి వస్తుంది. సాయంత్రం సమయంలో అందరూ వేడి వేడిగా ఈ పకోడీలు వేసుకుని తినవచ్చు. ఇలా ట్రై చేశారంటే పక్కాగా బయట తిన్న రుచి వస్తుంది. మరి క్రిస్పీగా చికెన్ పకోడీలు ఎలా వేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు:
చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, పచ్చి మిర్చి, నిమ్మరసం, కరివేపాకు, పెరుగు, ఆయిల్.
చికెన్ పకోడీ తయారీ విధానం:
ముందుగా చికెన్‌లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు చికెన్‌ని సాయంత్రం పకోడీలు వేసుకోవాలంటే ఉదయాన్నే మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి. లేదంటే ఓ గంట పాటు మ్యారినేట్ చేసినా సరిపోతుంది. ముందుగా చికెన్‌లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి మిర్చి, నిమ్మరసం వేసి ముక్కలకు పట్టించేలా బాగా కలుపుకోవాలి.
ఇక మీరు పకోడీలు వేసుకునే ముందు.. చికెన్‌ని బయటకు తీసి అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ మిక్స్ చేయాలి. కావాలంటే గుడ్లు కూడా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. పకోడీలు వేసుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకుని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేయించి పకోడీలపై వేసుకోవచ్చు.