‘కల్కి 2898 AD’ లో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ స్క్రీన్ పై అదరగొట్టేశారు.
ఫలితంగా కల్కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ .. ఆ అంచనాలను అందుకుంది. ఈ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ లో నటించిన ప్రతిఒక్కరు.. తమ అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగేఈ కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ లో కనిపించింది చాలా తక్కువే కానీ భారీ రెమ్యూనరేషన్ అందుకుంది.
ఈ లో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ మూవీ అశ్వత్థామ పాత్రలో నటించారు. అలాగే కమల్ హాసన్ విలన్ గా కనిపించారు. ఆయన పాత్ర పేరు యాస్కిన్. లో తొలిసారి కనిపించినప్పుడు వృద్ధుడిలా కనిపిస్తాడు. చూసిన వారికి ముసలి విలన్ అని అనుకుంటున్నారు. అయితే చివర్లో ఆయన పాత్ర నిజస్వరూపం తెలిసిపోతుంది. దానికి కారణం ఉంది. అదేంటనేది తెలియాలంటే చూడాల్సిందే.
లో కమల్ హాసన్ పాత్ర కేవలం మూడు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ముగిసే సన్నివేశంలో కమల్ హాసన్ కనిపిస్తారు. రెండో భాగం కూడా ఉండటంతో చివరిలో ట్విస్ట్ ఉంటుంది. అయితే మొదటి భాగంలో అతని పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో పాత్రలోని బలాన్ని చూపించాడు. రెండో భాగంలో విలన్ పాత్ర ఆధారంగా కథ మొత్తం సాగుతుంది.
మొదటి పార్ట్ లో ఆయన పాత్ర చిన్నగా, నెగిటివ్ రోల్ గా ఉన్నప్పటికీ కమల్ ఒప్పుకోవడం గొప్ప విషయం.. ‘కల్కి 2898 ఏడీ’ లో నటించేందుకు కమల్‌హాసన్‌కు 20 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘కల్కి’ లో కమల్ హాసన్ కనిపించేది కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలోనే కమల్ హాసన్ కి 20 కోట్లు ఇచ్చారు నిర్మాత అశ్వినీదత్. ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ కనిపించిన నిడివి తక్కువే అయినా, ఆయన పాత్ర షూటింగ్ చాలా రోజులైంది. నిర్మాత అశ్వినీదత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 60శాతం పూర్తయింది. 40శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది గ్రీన్ మ్యాట్ షూటింగ్ కావడంతో, నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పాత్ర షూటింగ్‌ను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కారణంగా కమల్‌కు 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట.