దారుణం.. ఇంటర్ విద్యార్థిని పై లెక్చరర్ లైంగిక దాడి

రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల మహిళలు, బాలికలపై లైంగిక దాడి(sexual assault) ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు లైంగికదాడులు చోటుచేసుకోవడం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.


మహిళలపై లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్యలు చేయడం వంటి ఘటనలు కూడా వెలుగు చూస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి(Rajamandri)లో ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్‌ కాలేజీ లెక్చరర్(Private College Lecturer) దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఆ విద్యార్థినిపై మూడు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే కూతురు కనిపించకపోవడంతో కొవ్వూరు పోలీస్ స్టేషన్‌(Police Station)లో విద్యార్థిని తల్లి మిస్సింగ్ కేసు(Missing Case) నమోదు చేసింది.

ఈ విషయం తెలిసిన లెక్చరర్ బాలికను భీమవరం(Bhimavaram)లో వదిలి పారిపోయాడు. గత(జనవరి) నెల 28వ తేదీన విద్యార్థినిని విజయవాడ(Vijayawada) తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం ఇంటికి పంపించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ తరుణంలో తన తల్లికి ఫోన్ చేసి బాలిక విషయం చెప్పడంతో పోలీసులు మిస్సింగ్ కేసును పోక్సో కేసు(Pocso Case)గా మార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.