Daksha Nagarkar: అందుకే నా తొడలు సెక్సీగా ఉంటాయ్

Daksha Nagarkar: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ఆస్క్ మీ ఎనీథింగ్ ద్వారా తెగ చాట్ చేసేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న నెటిజన్లలో చాలా మంది చిల్లర ప్రశ్నలు వేసేవారు ఉన్నారు.
ఈ విషయం తెలిసి కూడా హీరోయిన్లు వారి నుంచి ప్రశ్నలు ఆశిస్తుంటారు. అఫ్‌కోర్స్ హీరోయిన్లు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చి పాపులర్ అవ్వాలని కూడా చూస్తుంటారు. ఇప్పుడు కుర్ర హీరోయిన్ దక్ష నగార్కర్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లున్నారు.


నిన్న దక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసారు. చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసారు. ఇంకా చెత్త ప్రశ్నలు రాలేదేంటబ్బా అనుకుంటుండగానే ఓ చిల్లర నెటిజన్ దక్షను ఓ ప్రశ్న అడిగాడు. మీ తొడలు చాలా అందంగా ఉంటాయ్‌. వాటి వెనకున్న రహస్యం ఏంటి అని అడిగాడు. దక్ష ఈ ప్రశ్నను ఎవాయిడ్ చేసి ఉండొచ్చు. కానీ వారితో సమానంగా చిల్లరగా సమాధానం ఇచ్చి తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. తాను మసాలా వడలు తింటానని అందుకే తొడలు అలా ఉన్నాయని ఆన్సర్ ఇచ్చారు
ఇక సినిమాల విషయానికొస్తే బంగార్రాజు సినిమాలో దక్ష నగార్కర్ తన అందచందాలతో టాలీవుడ్ చూపులను తనవైపు తిప్పుకున్నారు. అదీకాకుండా బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో నాగ చైతన్య దక్ష వైపు చూసి నవ్విన ఘటన ఇప్పటికీ వైరల్‌గా మారుతోంది. చివరగా దక్ష రావణాసుర సినిమాలో కనిపించారు. ఇప్పటికైతే దక్ష చేతిలో సినిమాలు ఏమీ లేనట్లే తెలుస్తోంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసి వారు ఏదో ఒక వైరల్ ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇచ్చి వార్తల్లో నిలవాలని దాని వల్ల దక్ష అనే ఒక హీరోయిన్ ఉందని మరోసారి గుర్తు చేసినట్లు అవుతుందని దక్ష ప్లాన్ చేసినట్లున్నారు.