Eight Saturdays Deeparadhana :శనివారం అనగానే గుర్తుకువచ్చే దేవుడు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాగే ఆపదలు రాగానే ఆదుకొమ్మని అడిగేది, ఆ ఆపదమోక్కులవాడినే.
మన జీవితంలో శని దేవిని ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే, వెంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం పూజలు చెయ్యాలి.
ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు. ఏడుకొండలవాడి దయతో పాటు, శనిదోషం కూడా పోవాలంటే 8 శనివారాలు ఖచ్చితంగా ఇలా చేయాలి. ఒకవేళ ఆడవాళ్ళు చేస్తే… ఏమైనా అడ్డంకులు వస్తే ఎక్కడ ఆపారో అక్కడ నుంచి లెక్క వేసుకుని చేయవచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం…
శనివారం ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వరస్వామికి అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యంపిండి పాలు ఒక చిన్న ముక్క బెల్లం మరియు అరటి పండు వేసి కలిపి చపాతిలాగా చేసి దానితోనే ప్రమిదలాగా చెయ్యాలి… అంటే బియ్యంపిండి ప్రమిద అన్నమాట. అయితే ఈ ప్రమిదలో 7 వొత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వరస్వామి పూజ చేస్తే దోషాలన్నీ పోయి, అనుకున్న పనులు జరుగుతాయి.