ఇడ్లీ, దోశల్లోకి చట్నీతో పాటు ఎంతో కమ్మగా ఉండే కారం పొడి ఉంటే ఆహా రుచే వేరు. అందులోనూ ఎప్పుడు చేసేది కాకుండా.. ఈ చెట్టినాడ్ ఇడ్లీ పొడి కాస్త కొత్తగా వెరైటీగా ఉంటుంది. దీన్ని అన్నంతో కూడా తినవచ్చు. ఒక్కసారి చేసుకున్నారంటే దాదాపు నెల రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంత రుచిగా ఉండే చెట్టినాడ్ కారం పొడి టేస్ట్‌ని మీరు కూడా తినాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్.. ఈ చెట్టినాడ్ కారం పొడిని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడ్ కారం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
మినపప్పు, శనగ పప్పు, కంది పప్పు, నువ్వులు, ఉప్పు, కరివేపాకు , ఎండు మిర్చి, వేరుశనగ.
చెట్టినాడ్ కారం పొడి తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కందిపప్పు, శనగ పప్పు, మినపప్పు ఒకే క్వాంటిటీలో తీసుకుని విడివిడిగా వేయించు కోవాలి. ఆ తర్వాత నువ్వులు కూడా పావు కప్పు తీసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు వేరు శనగ కూడా ఇలాగే వేయించి తీసుకోవాలి. ఆ నెక్ట్స్ కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. చల్లారిన పప్పులను మిక్సీ జార్‌లో వేసి ఉప్పు, ఎండు మిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ పొడిని ఇడ్లీ, దోశల మీద చల్లుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే.. వావ్ అని ఖచ్చితంగా అంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ పొడి. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. ఎప్పుడు చట్నీలే కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మరింకెందుకు లేట్ మీరు కూడా చేయండి.