Dhoom 4 : ధూమ్ 4 లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

యూత్ ఆడియన్స్ వెరిక్కిపోయే ఫ్రాంచైజ్ లో ఒకటి ధూమ్ సిరీస్. ‘జాన్ అబ్రహం’ తో మొదలైన ఈ క్రేజీ సిరీస్, అమీర్ ఖాన్ తో ముగిసింది. 2013 వ సంవత్సరం లో విడుదలైన ‘ధూమ్ 3’ తర్వాత మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ నుండి సినిమాలు రాలేదు.


అభిమానులు ఈ విషయం లో ఎంతో నిరాశకి గురయ్యారు. ఈ ఫ్రాంచైజ్ ద్వారా వచ్చే సినిమాలకు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. కానీ ఎందుకు పక్కన పెట్టేసారు అని ఆ ఫ్రాంచైజ్ అభిమానులు బాధపడుతున్నారు. 2013 వ సంవత్సరం లో విడుదలైన ‘ధూమ్ 3 ‘ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆరోజుల్లోనే 500 కోట్లు అంటే, ఈ ఫ్రాంచైజ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రాంచైజ్ ని అమితంగా ఇష్టపడే అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త.

త్వరలోనే ‘ధూమ్ 4’ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారట యాష్ రాజ్ సంస్థ. ఈ సినిమాలో హీరోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించాలని ఇటీవలే నిర్మాతలు ఆయన్ని కలిసి రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కథలో నటనకు ప్రాధాన్యత చాలా ఉందని, మీ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పారట. రామ్ చరణ్ కి కూడా కథ నచ్చడంతో, ప్రస్తుతం ఉన్నటువంటి కమిట్మెంట్స్ పూర్తి అయ్యాక చేద్దామని చెప్పాడట. అయితే ముందు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ని అభిషేక్ బచ్చన్ చేయగా, అతని అసిస్టెంట్ క్యారక్టర్ ని ఉదయ్ చోప్రా చేసాడు. కానీ ఈసారి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో వరుణ్ ధావన్, అలాగే ఉదయ్ చోప్రా క్యారక్టర్ లో కార్తీక్ ఆర్యన్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో తెలుగు నటీనటులకు స్కోప్ తక్కువే. ఇది ఫక్తు బాలీవుడ్ సినిమాగా తెరకెక్కబోతుందట.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కూడా మొదలుపెట్టాడు సుకుమార్. ఈ చిత్రం తర్వాత సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. మరి ధూమ్ 4 కి రామ్ చరణ్ డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏకకాలం లో రామ్ చరణ్ రెండు సినిమాల్లో నటించే అవకాశం ఉంది. అలా చేస్తే సుకుమార్ సినిమా పూర్తి అయిన వెంటనే చేయొచ్చు. చూడాలి మరి ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాడు అనేది. ఇకపోతే బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.