సౌందర్య మరణం సహజ మరణం కాదా? సౌందర్యను స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా?

సౌందర్య మరణం సహజ మరణం కాదా? సౌందర్యను స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా? ఆమె మరణించిన 20 ఏళ్ళ తరువాత పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు?
నిజం ఎంత?
తెలుగు సినిమాకు మరో సావిత్రి అంటే సౌందర్య అనే చెప్పాలి. అంత పద్దతిగా, ఎటువంటి ఎక్స్ పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సాధించడం అంత తేలికైన పనికాదు. దాదాపు తెలుగు ,తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య.. పెళ్ళైన తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో.. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.


ఆతరువాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సౌందర్య.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య మరణంతో ఇండస్ట్రీ షాక్ తిన్నది. ఇక సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్ళు పైనే అవుతోంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అయిన తరుణంలో.. ఇన్నేళ్ళకు.. సౌందర్యది సహజమరణం కాదు, ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అంతే కాదు షాకింగ్ విషయం ఏంటంటే, సౌందర్యను టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు.

సౌందర్యది సహజ మరణం కాదా? మోహన్ బాబు నిజంగా హత్య చేయించారా? ఎందుకు కోసం ఇలా జరిగి ఉంటుంది. కారణం ఏంటి? నిజా నిజాలేంటి? సౌందర్యకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ఆస్తి కోసం మోహన్ బాబు కావాలనే సౌందర్యను హత్య చేయించారంటు ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబద్ లోని శంషాబాద్ సమీపంలోని జల్ పల్లిలో పెద్ద ఇంట్లో ఉంటున్నారు.

అయితే ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తి, ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టు సమాచారం. అయితే అది ఆయన కొనలేదని.. సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపణ. ఇంతకీ ఎవరు అతను. మోహన్ బాబుపై చేసిన పిర్యాదు ఏంటి.

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు. సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి అతను ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతే కాదు దివంగత హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు.

దాంతో వారిపై ఈ విషయంలో కక్షపెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్షాలు దొరక్కుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని, ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన కంప్లైయింట్ లో తెలిపాడు. అసలే ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్న మోహన్ బాబుపై మరో బాంబ్ పేలినట్టు అయ్యింది. ఇక అంతటితో ఆగకుండా చిట్టిబాబు మరో డిమాండ్ కూడా చేస్తున్నాడు.

మంచు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అంతేకాక మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కి న్యాయం చేయాలని, ఈ విషయంలో మోహన్ బాబు పై తగు చర్యలు తీసుకోవాలని కంప్లైయింట్ లో కోరాడు చిట్టి బాబు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంత ధైర్యంగా ఓ వ్యక్తి వచ్చి ఇలా కంప్లైయింట్ చేయడం, ఆరోపణలు చేయడం తో అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.