గత ప్రభుత్వ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసారు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం ఇదే మొదటిది. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోంది.
ఇసుక పై సీనరేజీ తీసేసిన తరువాత పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరగకూడదు. ఎంత ఇసుక కావాలో అంతా ఉదయం పూటే దొరుకుతుంది. పక్క రాష్ట్రాలకు ఇసుక వెళ్ళే చోట సిసి కెమెరాలు పెట్టాలి. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుదాం అని పేర్కొన్నారు.
అయితే ఎంఎల్ఏ లు ఎవ్వరూ వేలు పెట్టడానికి వీల్లేదు.. కలెక్టర్లకు ఇసుకపై కంట్రోల్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ను కూడా లిక్కర్ విషయంలో పూర్తిగా అమలు చేస్తున్నాం. బెల్ట్ షాపులు పెట్టినా, రేట్లు పెంచినా తెలియాలి. అధికారులు చెప్పకపోయినా.. తాగిన వాళ్ళు కరెక్టుగా చెపుతారేమో అంటూ సీఎం ఛలోక్తులు చెప్పారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి చేయాలి. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు అమలులో నిర్దాక్షిణ్యంగా పని చేయాలి. డిజిటల్ పేమెంట్ల వలన NDPL ను కంట్రోల్ చేయచ్చు అని చంద్రబబు అన్నారు.