Divvela..Duvvada : దివ్వెల..దువ్వాడ వాలెంటైన్స్ డే వెరీ స్పెషల్

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా ప్రేమికులందు ఏపీకి చెందిన ప్రేమికులు వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Ycp Mlc Duvvada Srinivas) దివ్వెల మాధురి(Divvela Madhuri)లు వేరయా అని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇద్దరికి కూడా పెళ్లయి..పిల్లలు కూడా ఉన్నప్పటికి లేటు వయసులో ఘాటు ప్రేమికులుగా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల ప్రేమ వ్యవహారం..సంబంధిత వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు.


సినిమా సెలబ్రిటీస్ కంటే కూడా వారిద్దరి ప్రేమ వ్యవహారం మోస్టు పాపులర్ గా చెప్పవచ్చు. వారిద్ధరు తిరుమల ఆలయం వద్ధ రీల్స్ చేసినా…ఇంకేది చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. అంతటి పాపులర్ ముదురు ప్రేమజంట చేసుకున్న ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే Valentine’s Day) ఇంకెంత స్పెషల్ గా ఉంటుందో తెలుసుకోవాల్సిందే మరి. వాలెంటైన్స్‌ వీక్‌(Valentine’s Week)లో మొదటి రోజైన ఫిబ్రవరి 7వ తేదీ రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే, 14వ తేదీన వాలెంటైన్స్ డే పురస్కరించుకుని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.

ఈ వీడియోలో మాధురి ఐలవ్ రాజా అంటూ దువ్వాడకు తన ప్రేమను ప్రకటించింది. యువ ప్రేమికుల మాదిరిగా వాలంటైన్ వీక్ పాటిస్తూ వారు చేతిలో చెయ్యేసి చెప్పుకున్న ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు(ప్రామీస్)లు , ఇచ్చుకున్న కానుకలు చూసి ప్రేమికుల దినోత్సవం సెలబ్రేషన్ అంటే ఇది అన్నట్లుగా ఉందంటున్నారు నెటిజన్లు. మరి మీరు కూడా దువ్వాడ, దివ్వెల వాలంటైన్స్ డే వేడుక చూడాలంటే ఈ క్రింది వీడియోను చూసేయండి.