అరటి పండును పేదవాడి ఆపిల్‌గా పిలుస్తారు. తక్కువ ధరకు లభించే అరటితో కలిగే లాభాలు అలాంటివి మరి. అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా అరటి పండును తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అరటి పండ్లలో అనేక రకాల విటమిన్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులోని ఐరన్, ఫైబర్, ఆక్సిడెంట్స్ కిడ్నీలు, జీర్ణవ్యవస్థ, గుండె వంటి అవయవాలను కాపాడుతాయి.
మరి ఇన్ని లాభాలు ఉండే అరటి పండ్లతో వచ్చే సమస్యల్లో అవి త్వరగా కుళ్లి పోవడం ఒక సమస్యగా చెప్పొచ్చు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా అరటి పండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇంతకీ అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* అరటి పండ్లను వేలాడదీస్తే త్వరగా పాడవవు. ఇందుకోసం ఒక తాడుతో కట్టి గాలి సోకే ప్రాంతంలో వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
* ఇక అరటి పండ్లను ప్లాస్టిక్ ర్యాపింగ్‌లో చుట్టడం వల్ల కూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. గాలి తాకకుండా ఉండేలా కవర్‌తో అరటిపండ్లను కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల అరటి పండ్లు తాజాగా ఉంటాయి.
* అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే అరటి పండ్లకు వెనిగర్‌ను అప్లై చేయాలి. అనంతరం గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
* అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టినా తాజాగా ఉంటాయి. అయితే ఫ్రిజ్‌లో పెట్టే ముందు అరటి పండ్లకు గాలి చొరబడకుండా కవర్‌లో ప్యాక్ చేయాలి.
* ఇదిలా ఉంటే మీరు కొనుగోలు చేసిన అరటి పండ్లలో ఒక్క పండు కుళ్లిపోయినా దానిని తొలగించాలి. ఇందుకంటే బాగా మక్కిన అరటిపండు నుంచి ఇథిలిన్ వాయువు వస్తుంది. ఇది పక్కనున్న అరటిపండ్లను కూడా కుళ్లిపోయేలా చేస్తుంది.