Giloy: తిప్పతీగ గురించి తెలుసా? దీన్ని రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటంటే..!

www.mannamweb.com


ప్రకృతి చాలా విచిత్రమైనది. చాలా సాధారణం అనిపించే ఎన్నో మొక్కలు, చెట్లు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో భాగంగా ఉన్నాయి. చాలా వరకు రోడ్ల పక్కన, పొదలలోనూ తమలపాకులాగా తీగలు అల్లుకుని ఉంటాయి. వీటిని తిప్పతీగ అంటారు. తిప్పతీగ కరోనా ముందు వరకు ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ కరోనా కాలంలో తిప్పతీగ ప్రయోజనాల గురించి చాలా వైరల్ అయింది. అప్పటినుండి తిప్పతీగ ప్రజల జీవనశైలిలో భాగం అయ్యింది. అయితే చాలామందికి దీని పూర్తీ ప్రయోజనాల గురించి తెలియదు. తిప్పతీగ ఔషద గుణాలు, దాని ప్రయోజనాలు తెలుసుకుంటే..

ఆయుర్వేదంలో తిప్పతీగ ఆకులు, వేర్లు, కాండం ఇలా అన్నీ చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయని పేర్కొనబడింది. తిప్పతీగ కాండం, కొమ్మ ఎక్కువగా వ్యాధులలో ఉపయోగిస్తారు. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గిలోయ్ అనే గ్లూకోసైడ్, టెనోస్పోరిన్, పామరిన్, టెనోస్పోరిక్ యాసిడ్ తిప్పతీగలో ఉంటాయి. ఇది కాకుండా తిప్పతీగలో ఐరన్, భాస్వరం, జింక్, కాపర్, కాల్షియం, మాంగనీస్ కూడా ఉంటాయి.

తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు..

జ్వరం, మధుమేహం, కామెర్లు, కీళ్లనొప్పులు, మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం, మూత్ర సమస్యల నుండి ఉపశమనానికి తిప్పతీగ ఉపయోగించబడుతుంది.

తిప్పతీగ వాత, పిత్త, కఫాతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనం చేకూర్చే ఔషధం. శరీరం నుండి విష పదార్థాలను, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా, ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

తిప్పతీగ ఇన్సులిన్ ఉత్పత్తి, సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్ నిర్వహణకు మంచి నివారణగా చేస్తుంది.

తిప్పతీగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)