Hair లైఫ్ స్టైల్: తలకు రంగు వేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?

www.mannamweb.com


ప్రస్తుతం జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు సైతం వస్తున్నాయి యువతకు. అంతేకాకుండా పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి.గతంలో కేవలం వృద్ధాప్యంలో మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి కానీ ఇప్పుడు సగటు పదిమందిలో కచ్చితంగా ఐదు మందికి సైతం తెల్ల వెంట్రుకలు రానే వస్తున్నాయి.
దీంతో వారు వెంట్రుకలకు రంగు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది అనేక రకాల దుష్ప్రభావాలకు కారణం అవుతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా జుట్టుకు రంగు వేసిన వెంటనే సైడ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ముందుగా పసిగట్టకపోతే చాలా అనార్థానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొందరు తల వెంట్రుకలు చిక్కులు పడకుండా స్ట్రైట్ గా ఉండాలని అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. హెయిర్ స్ట్రైట్నర్ ఉపయోగించడం వల్ల మహిళలు గర్భాశయ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డై కొన్నిసార్లు చర్మ ప్రతిచర్యకు కారణం అవుతుందట. అంతేకాకుండా చర్మం మీద మంట ఎరుపు బాడడం పొరలుగా చర్మం ఊడిపోవడం వంటివి జరుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
జుట్టు రంగులో ఉన్న రసాయనాలు కారణంగా ఇది మరింత ప్రభావం చూపుతోందట ఇలాంటి పరిస్థితుల్లో జుట్టుకు రంగు వేయకపోవడమే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. హెయిర్ డై వేసుకునేవారు చర్మా అలర్జీలు హస్తమాకు ఎక్కువగా గురవుతున్నారని ఒక అధ్యయనంలో తెలియజేశారు. జుట్టుకు రంగు వేయడం వల్ల అలర్జీ వచ్చిన వ్యక్తులు తల పైన ఎర్రటి దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా హేరుడై వేసుకున్న వ్యక్తికి పడకపోతే వాటి వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా ఎన్నో నష్టాలు జరుగుతాయి. అయితే కేవలం తనకు గోరింటాకు పట్టించుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదట.