మీ మొబైల్‌లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలుసా?

సాధారణంగా మన మొబైల్లో కొన్ని ఆప్షన్స్ ఉన్న మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఫ్లైట్ మోడ్ ఫీచర్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..
ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే.. మనకి ఫోన్ కాల్స్ రావు, మెసేజ్లు వెళ్ళవు, మొబైల్ డేటా పనిచేయదు ఇలా మాత్రమే తెలుసు. కానీ ఈ ఫ్లైట్ మోడ్ కొన్ని సందర్భాలలో ఆన్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల కూడా కలిగే లాభాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.


విమాన భద్రతా విషయంలో మొబైల్ ని ఫ్లైట్ మోడ్ లో ఉంచమని చెబుతూ ఉంటారు.. అయితే ఇలా ఆన్ చేయడానికి ముఖ్య కారణం నెట్ వర్క్ నుంచి వచ్చేసి సిగ్నల్స్ విమానంలోనే ఉండి నావిగేషన్ కమ్యూనికేషన్ సిస్టంకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కనుక ఫ్లైట్ మోడ్ ని ఆన్ చేస్తారు.

ఫ్లైట్ మోడల్ చార్జింగ్ వేగంగా జరుగుతుంది. తక్కువ సమయంలో మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉంచడం మంచిది.

నెట్వర్క్ సమస్యలు ఉన్నప్పుడు ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వెంటనే నెట్వర్క్ సమస్యలు తొలగిపోతాయి.

మనం ఎలాంటి అంతరాయాలు లేకుండా నిద్రపోవాలి అంటే మొబైల్ ని ఫ్లైట్ మోడ్లో పెట్టి నిద్రపోవచ్చు.

ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోమింగ్ ఛార్జీలు పడకుండా ఫ్లైట్ మోడ్ ని ఆన్ చేసుకోవచ్చు. అక్కడ ఉండే వైఫై ని ఉపయోగించుకొని మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు.

అప్పుడప్పుడు ఫ్లైట్ మోడ్ ని ఆన్ చేస్తూ ఉండడం వల్ల మొబైల్ రేడియేషన్ తగ్గిపోతుంది.

ఫ్లైట్ మోడ్ ని మనం విమానాలలో టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయాలలో.. ప్రయాణం చేస్తున్న సమయాలలో ఆన్ లో ఉంచాలి.

అయితే ఈ ఫ్లైట్ మోడ్ అనేది మనం రోజులు ఒక్కసారి అయినా ఆన్ చేస్తే.. ఎలాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.