టమాటోను తెలుగులో ఏమని పిలుస్తారో తెలుసా.. గెస్ కూడా చేయలేరేమో!

మాటో.. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ విరివిగా ఉపయోగించే కూరగాయ. టమాటోను ఉపయోగించి రకరకాల కర్రీలు చేస్తుంటారు. వెజ్ లోనే కాకుండా నాన్ వెజ్ లోనూ ఉపయోగిస్తుంటారు.

ఇంట్లో రసం, సాంబార్ పెట్టారంటే అందులో టమాటో పాడాల్సిందే. అలాగే టమాటోను పచ్చిగా తినేవారు ఉన్నారు. జ్యూస్ చేసుకుని తాగే వారు ఉన్నారు. అదంతా పక్కన పెడితే.. అసలు టమాటోను తెలుగులో ఏమని పిలుస్తారో తెలుసా? అదేం ప్రశ్న టమాటోనేగా అంటారా? కానీ కాదు నిజానికి అది ఇంగ్లీష్ వాడుక పదం. మనకి కూడా అదే అలవాటైపోయింది.


టమాటోను మనం కూరగాయగా వాడినా, శాస్త్రీయంగా ఇది పండు. మొట్టమొదటగా టమాటో దక్షిణ అమెరికాలో జన్మించింది. పాతకాలంలో టమాటో విషపూరితమని నమ్మేవారు. ఎందుకంటే సిల్వర్ ప్లేట్లపై టమాటోను పెట్టినప్పుడు ఆహారం నల్లగా మారిపోయేది. కారణం టమాటో యాసిడ్‌తో సిల్వర్ రియాక్ట్ కావడమే. ఆ తర్వాత టమాటో హానికరం కాదని తెలుసుకున్నారు.

టమాటోలు ఎర్రగా మాత్రమే ఉంటాయి అనుకుంటే పొరపాటే. హైబ్రీడ్, ఆర్గానిక్ తోటల్లో మనం పసుపు, నీలం, నలుపు, తెలుపు రంగుల్లో కూడా టమాటోలను చూడొచ్చు. టమాటో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్, గుండెజబ్బుల నివారణలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది. టమాటోలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని రక్తిస్తాయి. ఫైబర్ జీర్ణాశయానికి మేలు చేస్తాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి టమాటోలు ఉపయోగకరంగా ఉంటాయి.

టమాటో ఇమ్యూనిటీ బూస్టర్‌గానూ పని చేస్తుంది. చర్మానికి టమాటోను పూయడం వల్ల ముడతలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
అన్నట్లు టమాటోను తెలుగులో ఏమంటారో చెప్పలేదు కదూ.. పాత రోజుల్లో దీనిని `రామ ములగ` పేరుతో పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో `సీమ వంగ` అని, మరికొన్ని ప్రాంతాల్లో `రామన్న పండు` అని కూడా అనేవారు. క్రమంగా ఇంగ్లీష్‌ పదమైన టమాటోనే అందరూ అలవాటు చేసుకున్నారు. అందువల్లే చాలా మంది టమాటో తెలుగు పేరును కనీసం గెస్ కూడా చేయలేకపోతుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.