అమ్మాయిల షర్ట్ బటన్స్ ఎడమ వైపు, అబ్బాయిల షర్ట్ బటన్స్ కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా?

www.mannamweb.com


మనం రోజూ వాడే వస్తువుల్లో కొన్ని తేడాలు గుర్తించం. కానీ మనం రోజూ వేసుకునే దుస్తులను గమనిస్తే ఒక డౌట్ తప్పకుండా వస్తుంది. అది ఏమిటంటే? ఎప్పుడైనా అమ్మాయిల షర్ట్స్, అబ్బాయిల షర్ట్స్ గమనిస్తే, మహిళలకు షర్ట్ బటన్స్ ఎడమ వైపు, పురుషుల షర్ట్ బటన్స్ కుడి వైపు ఉంటాయి. అసలు ఇలా ఎందుకు ఉంటుంది. దీని వెనుక గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం యూరోపియన్ మహిళలు దుస్తులు ధరించిన విధానాన్ని అనుసరించి ఇలా గుండీలు ఉండే విధానంలో మార్పులు వచ్చాయని తెలుస్తోంది.అయితే అప్పట్లో శ్రీమంతులు ఎక్కువగా బటన్స్ ఉండే దుస్తులను వేసుకునే వారంట. ఇక వారి బట్టలను పని వారే దొడిగే వారంట.వారికి బటన్స్ పెట్టాలంటే సేవకులకు అనుగుణంగా ఉండేలా ఆడవారు ధరించే షర్టులకు ఎడమ వైపుకు అమర్చేవాళ్లట.అలా మహిళల షర్ట్‌కు ఎడమవైపు బటన్స్ అమర్చేవారంట.ఇదే కాకుండా చాలామంది మహిళలు తమ బిడ్డకు పాలు ఇచ్చేందుకు బిడ్డను ఎడమచేతిలో పట్టుకుని ఇస్తారని..అందుకని ఆడవాళ్ల షర్టు బటన్స్ ఎడమవైపు ఉండేలా ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు.
అలాగే అప్పట్లో మగవారు ఎక్కువగా సైన్యంలో పనిచేసేవారు. సైనికులు ఎక్కువగా ఆయుధాలను కుడి చేతితో వాడుతారు కాబట్టి దుస్తులకు బటన్లు కుడి వైపున నిర్మించడం వల్ల ఎడమ చేతితో అన్బటన్ చేయడం వంటివి సులభంగా చేయవచ్చు. అలా మగవారికి కుడివైపున బటన్స్ ఏర్పాటయ్యాయంటారు.