Weight Loss Drink: బరువు తగ్గాలనుకున్నారా.. ఉదయాన్నే ఇది తాగండి..!

చియా విత్తనాలు మన ఆరోగ్యకరానికి చాలా మంచిది. ఇవి తింటే శరీరం కూల్ గా ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఈ గింజలు పుదీనా కుటుంబానికి చెందిన సాల్వియా హిస్పానికమ్ నుండి వస్తాయి. వీటి రంగు ముదురు నలుపు రంగులో ఉంటాయి. చియా విత్తనాలు ప్రోటీన్ యొక్క పవర్‌హౌస్, అనేక ఇతర పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. చాలా మంది చియా విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఈ విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..


సలాడ్‌లు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లలో ఎక్కువగా చియా సీడ్స్‌ను వేస్తారు. కానీ.. చియా గింజల నుంచి ప్రయోజనాలను పొందాలనుకుంటే.. చియా సీడ్ నీటిని తాగితే మంచిది. చియా గింజల నీటిని తాగితే.. శరీర బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వీటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా ఆకలి కాకుండా చేస్తుంది. అంతేకాకుండా.. శరీరంలో జీవక్రియను పెంచుతాయి.

చియా గింజల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం, ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి.. ఆరోగ్యకరమైన ప్రేగు, జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది, ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా చియా విత్తనాలలో ఎక్కువగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, విటమిన్ బి, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఫోలేట్ అధికంగా ఉంటాయి.

చియా విత్తనాలను తినడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఒక గ్లాసు చియా గింజల నీటిని తయారు చేయడానికి.. ఒక టీస్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. కనీసం అరగంట సేపు నాననివ్వాలి. ఆ తరువాత.. నీటిని వడపోసి తాగాలి. చియా గింజల నీటి రుచి నచ్చకపోతే.. అందులో నిమ్మరసం, నారింజ రసం, నల్ల మిరియాలు, తేనెను కలిపి తాగవచ్చు. దీనిని ఉదయాన్నే తాగితే చాలా మంచిది.