రాత్రి మిగిలిపోయిన అన్నం తినమంటే ఇంట్లోని వారంతా ముఖం చిట్లిస్తారు. దీంతో మిగిలిన రైస్ డస్ట్ బిన్లో పడేయాల్సి వస్తుంది. ఇలా చేయడం అమ్మలకు బాధగా ఉంటుంది. రైస్ మొత్తం వేస్ట్ అయిపోతోందని దిగులుపడతారు. అందుకే మీకోసం ఓ చిన్న టిప్. మిగిలిపోయిన అన్నంతో ఇలా చపాతీలు ప్రిపేర్ చేయండి. వద్దన్నవారే ఇష్టంగా తినేస్తారు. రైస్ సేవ్ అవుతాయి. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- రైస్ – 1 కప్పు
- గోధుమ పిండి – 1 కప్పు
- ఆయిల్ – 1 స్పూన్
- ఉప్పు – తగినంత
-
తయారీ విధానం :
- ముందుగా కప్పు అన్నం తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని పేస్టులా చేసుకోవాలి.
- ఆ తర్వాత రైస్ పేస్టును మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
- అందులోనే కప్పు గోధుమ పిండి వేసుకోవాలి.
- తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. మిక్స్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అన్నం మిక్సీ పడుతున్నప్పుడు వేసిన వాటర్ సరిపోతుంది.
- పిండి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత, బౌల్ మీద కాటన్ క్లాత్ కప్పి సుమారు 15 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం చిన్న చిన్న ముద్దలు తయారు చేసుకొని, చపాతీల్లా వత్తుకుంటే సరిపోతుంది.
- ఇందులో అద్దిరిపోయే చపాతీ కుర్మా తయారు చేసుకున్నారంటే పిల్లల నుంచి పెద్దల వరకు వదలకుండా చపాతీలు లాగిస్తారు.
చపాతీ కుర్మా కోసం కావాల్సిన పదార్థాలు :
- టమాటాలు – రెండు
- ఉల్లిపాయలు – రెండు
- శనగపప్పు – 3 స్పూన్లు
- జీలకర్ర – 1 స్పూన్
- ఆవాలు – 1 స్పూన్
- మినప పప్పు – 1 స్పూన్
- పసుపు పొడి – పావు స్పూన్
- కరివేపాకు – 2 రెబ్బలు
- సోంపు – హాఫ్ స్పూన్
- పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
- ఉప్పు – తగినంత
- ఆయిల్ – 2 స్పూన్లు
- కొత్తిమీర – కాస్త
తయారీ విధానం :
- శనగపప్పును గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి, సోంపు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి జీలకర్ర, మినపపప్పు, ఆవాలు వేయించాలి.
- పసుపు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కాసేపు తర్వాత టమాటాలు వేసి ఉడికించాలి.
- టామాటాలు కుక్ అయినంక ఉప్పు వేసి, ఆ తర్వాత శనగపిండి పేస్టు వేసుకొని, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి.
- లో-ఫ్లేమ్‌లో 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.
- ఇలా చేసి పెడితే మీ ఇంట్లో ఇక ఎప్పుడూ రైస్ పడేయాల్సిన అవసరం రాదు. ఇంకా బియ్యం కూడా సేవ్ అవుతాయి. నచ్చితే ఇక నుంచి ఫాలో అవ్వండి.

































