డూమ్స్ డే చేప మళ్లీ కనిపించింది.. అది కూడా మన భారత్‌లోనే అనగానే ఒక రకమైన భయం, ఆందోళన మొదలయ్యింది. సాధారణంగా జపాన్, ఆస్ట్రేలియా తీరంలో కనిపించే ఈ చేప ఏకంగా తమిళనాడులోనే కనిపించేసింది.
ఈ చేపను చూసి భయాందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా రచ్చ కూడా మొదలైంది. డూమ్స్ డే చేప దీన్ని డీప్ ఓర్ ఫిష్, రిబ్బన్ ఫిష్ అని కూడా పిలుస్తారు.
సాధారణంగా జపాన్ ప్రజలు ఈ చేప కనిపిస్తే వినాశనానికి సూచన సునామీ రాబోతుంది అని నమ్ముతారు. ఇటీవల ఆస్ట్రేలియా తీరంలో కూడా ఈ చేప కనిపించింది. అయితే ప్రస్తుతం భారతదేశ తీరంలో తమిళనాడులో మత్స్యకారులకు చిక్కింది. సముద్రపు లోతుల్లో నివసించే ఈ చేప ఒడ్డునకు కావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . ఈ చేప కనిపించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని జపనీస్ వారు నమ్ముతారు.
ఎందుకంటే గతంలో కూడా ఈ చేప కనిపించిందంటే సునామీ లేదా భూకంపం ప్రకృతి వైపరిత్యాలు వచ్చాయని నమ్ముతారు. ఇది భూకంపానికి ఓ దూత అని కూడా పిలుస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు ఈ చేపకు ఇలాంటి ఓ వింత సంబంధం ఉంది. శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని పూర్తిగా తిరస్కరించారు.
ఫిలిప్పీన్స్ భూకంపం..
ఫిలిప్పీన్స్ లో 2017 లో జరిగిన భూకంపానికి రెండు రోజుల ముందు ఈ డూమ్స్ డే చేపలు కనిపించాయి. 2011 జపాన్ వినాశకరమైన భూకంపం సమయంలో కూడా డజన్ల కొద్ది చేపలు కనిపించాయి. పకృతి వైపరీత్యానికి ముందుగా ఇది కనిపించడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు మెక్సికోలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇప్పుడు ఏకంగా భారత్ లోని తమిళనాడులో ఈ చేప రావడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు.
హిందూ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్ లోతు దాదాపు 11 కిలోమీటర్ల లోతులో ఇవి నివసిస్తాయి. సూర్య కిరణాలు కేవలం వెయ్యి మీటర్ల లోతుకు మాత్రమే చొచ్చుకు పోతాయి. అయితే ఇవి సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. బ్లాక్ సీ డెవిల్ గ్యాంగ్లీడర్ ఫిష్, డూమ్స్ డే ఫిష్ మాత్రం లోతులో మాత్రమే ఉంటాయి. భూ ఉపరితంలోకి రావడం చాలా అరుదు.
అరుదైన రిబ్బన్ ఫిష్..
ఈ అరుదైన డూమ్స్ డే చేప రిబ్బన్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని రిబ్బన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో కూడా ఇది కనిపించింది. సాధారణంగా ఈ డూమ్స్ డే చేప భూ ఉపరితలానికి వచ్చిందంటే కచ్చితంగా ఏదో వినాశనం జరుగుతుందని అందరూ ఆందోనల పడుతున్నారు.