నీళ్లు ఎక్కువ తాగినా ఆరోగ్యానికి ప్రమాదమే.. రోజుకు ఎన్ని లీటర్లు తాగాలంటే..

www.mannamweb.com


ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు, కానీ మరీ ఎక్కువ నీరు తాగితే అది హాని కూడా కలిగిస్తుందట.
ఎందుకంటే ఏదైనా అతిగా చేయడం మంచిది కాదు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మనిషి ఆరోగ్యం పాడైపోయిందని చాలాసార్లు వార్తల్లో చూసే ఉంటాం. కానీ మీరు త్రాగే నీరు మీ శరీరానికి సరిపోతుందా లేదా, ఎక్కువ అయ్యాయా ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువగా తాగితే కలిగే ఫలితాలు..

ఎక్కువ నీరు త్రాగడం ద్వారా మెదడు సరిగా పనిచేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు తాగడం వల్ల మన మెదడు కణాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాని వల్ల కణాలు ఉబ్బి మెదడు పై ఒత్తిడి తెస్తాయట. అలాంటప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అలాగే పని పైన దృష్టి పెట్టలేరని చెబుతున్నారు. మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల, హృదయ స్పందన తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. రక్తపోటు కూడా అధికమవుతుందట. శరీరంలో నీరు అధికంగా ఉండటం వల్ల, సోడియం లోపం ఏర్పడుతుందని చెబుతున్నారు. దీని కారణంగా మీరు త్వరలో హైపో నాట్రేమియాకు గురవుతారట. సోడియం మన శరీరానికి చాలా అవసరం, దాని పరిమాణం తక్కువగా ఉంటే శరీరంలోని కణాలు ఉబ్బుతాయని చెబుతున్నారు. ఈ సమస్య పెరిగితే వ్యక్తి కోమాలోకి వెళ్లి మృతి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

శరీరంలో నీరు ఎక్కువైతే కనిపించే లక్షణాలు..

1. మూత్రం రంగు

మనం నీరు ఎక్కువగా లేదా తక్కువ తాగినప్పుడల్లా మూత్రం రంగు మనకు సంకేతాలు ఇస్తాయి. ఎక్కువ నీరు తాగితే మూత్రం రంగు స్పష్టంగా, నీరులా కనిపిస్తుంది. అలాగే శరీరంలో నీటి పరిమాణం తగ్గితే మూత్రం రంగు లేత పసుపు రంగులో కనిపిస్తుంది.

2. వికారం
ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాల పై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా శరీరం నుండి అదనపు ద్రవాన్ని బయటకు తీయలేకపోతుంది. దీంతో శరీరంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం రావచ్చు. దీని వల్ల రోజంతా అలసటగా అనిపించవచ్చు.

3. చేతులు, కాళ్ళలో నొప్పి, వాపు

నీరు ఎక్కువగా తాగే వారికి శరీరంలో వాపుతో పాటు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఎక్కువ నీరు తాగినప్పుడు శరీరంలో సోడియం పరిమాణం తగ్గిపోయి కండరాలు బలహీనంగా మారి నొప్పి కూడా మొదలవుతుంది.