చాలామంది ప్రతిరోజూ ఉదయం లేవగానే పళ్ళు శుభ్రం చేసుకోక ముందే నీటిని తాగడం అలవాటు. కొంతమంది మాత్రం పళ్ళు తోమిన తర్వాత నీళ్లు తాగడం ఏదైనా తినడం కాఫీ తాగడం లాంటివి చేస్తూ ఉంటారు.
కానీ ఉదయాన్నే పళ్ళు తోమకుండా నీటిని తాగడం మంచి అలవాటేనా అన్న సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు.
మన పెద్దలు ఖాళీ కడుపుతో గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగమని సలహానిస్తుంటారు. రెగ్యులర్ గా నీళ్లను ఇలా తాగితే మన శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోవడంతో పాటుగా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి నిజంగానే అది నిజమేనా వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా జపనీస్ వారు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకోకుండా రెండు మూడు గ్లాసుల వేడి నీటిని తాగుతారు. ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి హాని జరగదు. వైద్యులు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్లను తాగమని చెబుతూ ఉంటారు.
అయితే ఉదయం లేచిన వెంటనే నోటిలో బ్యాక్టీరియా ఉంటుందని అప్పుడు నీళ్లు తాగితే ఆ బాక్టీరియా మన కడుపులోకి చేరుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.
అయితే ఈ విషయంపై శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. పళ్లు తోముకోకుండా నీటిని తాగినప్పుడు నోటిలో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా కడుపులోకి వెళుతుంది.
కానీ దానిలో ఉండే అధిక అమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి పళ్లను తోముకోకున్నా నీళ్లను తాగవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే పళ్ళు శుభ్రం చేసుకోకుండా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా జలుబు సాధారణ జ్వరం వంటి సమస్యలకు గురి అయ్యే వారు ఈ నీటిని తాగితే చక్కటి ఫలితం లభిస్తుంది. పరగడుపున నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మంచిది.
చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో తాజా శరీర కణాల పెరుగుదలకు సహాయపడటం మాత్రమే కాకుండా టాక్సిన్స్, మృత కణాలను బయటకు పంపడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అలాగే పళ్ళు తోముకుండా ఉదయాన్నే నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.
దాంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు అజీర్తి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పరిగడుపునే నీళ్లను తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. అలాగే కావిటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు, డాయబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ నీళ్లను తాగితే వారి ఆరోగ్యం బాగుంటుంది.