స్మార్ట్‌ఫోన్స్ అన్నింటిలో రెండు సిమ్ములు వాడుకునే సౌకర్యం ఉంది. కీప్యాడ్ మొబైల్స్‌లో వాడే కాలం నుంచే ఫోన్లలో 2 సిమ్ములు వాడుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది. ఇక నేటి కాలంలో చాలా మంది రెండేసి సిమ్‌లు వాడుతున్నారు. ఒక సిమ్మును పర్సనల్ పనుల కోసం వాడితే.. మరొక దాన్ని బయటి వర్క్ కోసం వాడతారు. ప్రస్తుత కాలంలో రెండు సిమ్ములు వాడే వారే అధికం. మరి మీరు కూడా రెండు సిమ్ములు వాడుతున్నారా.. అయితే త్వరలోనే మీ జేబుకు భారీగా చిల్లు పడునుంది. టెలికాం కంపెనీలు భారీ బాదుడు మొదలు పెట్టన్నునాయి. దాంతో రెండు సిమ్ములు వాడే వారికి కష్టాలు మొదలు కానున్నాయి. ఎందుకంటే..
త్వరలోనే టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్‌ల ధరలు పెంచబోతున్నాయి. 2021, డిసెంబర్లో చివరిసారిగా టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్ ధర పెంచాయి. ఇప్పుడు అనగా రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ వాటిని సవరించడానికి సిద్దమవుతున్నాయి. దీనివల్ల టారిఫ్ ప్లాన్‌లు భారీగా పెరగనున్నాయి. దాంతో రెండు సిమ్ములు వాడే వారి జేబుకు భారీ చిల్లు పడనుంది.. ఎందుకంటే రెండు సిమ్ములను యాక్టివ్‌గా ఉంచడానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచడానికి కనీసం రూ. 150 రీఛార్జ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ టారిఫ్ పెరిగితే రూ. 150కి బదులుగా . 180 నుంచి రూ. 200 వరకూ చెల్లించవలసి ఉంటుంది. ఇక మీరు కూడా రెండు సిమ్ములను వాడుతున్నట్లైతే.. రెండింటిని యాక్టీవ్‌గా ఉంచడం కోసం నెలకు సుమారు రూ. 400 వరకు రీచార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.
ప్రస్తుతం మీరు నెలకు రూ. 300 రీఛార్జ్ చేసుకుంటే టారిఫ్ పెరిగిన తర్వాత నెలకు రూ. 75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరునెలవారీ రూ.500 రీఛార్జ్ చేసుకుంటే రూ.125 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ త్వరలో 5జీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇవి 5జీ సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి. కానీ భవిష్యత్తులో వాటికి కూడా డబ్బులు వసూలు చేయవచ్చు అంటున్నారు. అప్పుడు మీరు ఒక సిమ్ 5జీ, మరో సిమ్ 4జీని వాడినట్లయితే నెలవారీ రీఛార్జ్ ఖర్చు దాదాపు 50 శాతం పెరుగుతుంది. ఎందుకంటే 5జీ ప్లాన్ ధర 4జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే 4జీ ప్లాన్ ధరను కూడా పెంచుతున్నారు. దీంతో సామాన్యుల జేబుకు చిల్లు పడే పరిస్థితి రానుంది.