వీటిని ఎక్కడ దొరికితే అక్కడ వదలకుండా తినండి.

వాటర్ చెస్ట్‌నట్లు కూరగాయలతో పాటు మార్కెట్ లలో సందడి చేస్తాయి. ఇవి చిత్తడి నేలలు, చెరువులు, వరి పొలాలు, లోతులేని సరస్సులలో నీటి అడుగున పెరుగుతాయి.


కనుక వీటిని వాటర్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. వాటర్ చెస్ట్‌నట్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. చాలామంది దీనిని ఉపవాస సమయంలో తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది వీటిని ఉడకబెట్టుకుని, లేదా సలాడ్ రూపంలో తింటారు. అంటే ఇవి చాలా రకాలుగా తినే ఆహారంలో చేర్చుకుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటి విటమిన్ సి, మాంగనీస్, ప్రొటీన్, థయామిన్, ఇంకా అనేక పోషకాలు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో చెస్ట్ నట్ తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని తింటే చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి.

వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. చెస్ట్‌నట్ లోని పిండి పదార్ధం ప్రేగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాటర్ చెస్ట్‌నట్ తినడం వలన జుట్టు సమస్యలకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని డైటీషియన్ చెప్పారు. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు వాటర్ చెస్ట్ నట్స్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా వాటర్ చెస్ట్‌నట్‌ను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి: ముఖ్యంగా ఈ కాలంలో కొందరు తగినంత నీరు తాగరు. దీని వలన శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఉడికించిన చెస్ట్‌నట్ తినడం వల్ల శరీరంలో హైడ్రేషన్ మెయింటెయిన్ అవుతుంది. తక్కువ పరిమాణంలో నీరు తాగే వారు ఈ సీజన్ లో ఖచ్చితంగా వాటర్ చెస్ట్‌నట్ తినమని సూచిస్తున్నారు. తద్వారా డీహైడ్రేషన్ సమస్య ఉండదు. బరువు తగ్గడానికి డైట్ ను అనుసరించే వారు తాము తినే ఆహారంలో ఈ నీటి చెస్ట్‌నట్‌లను చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వాటర్ చెస్ట్‌నట్‌లు అధిక ఫైబర్ ఉన్న ఆహరం. ఇవి తింటే ఎక్కువ కేలరీలు ఆహారం తినకుండా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. నిపుణులు వీటి యొక్క అన్ని ప్రయోజనాలను చెప్పారు. ఈ కాలంలో ఈ పండును ఉడకబెట్టి తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.