Ration card: 31లోపు రేషన్‌ కార్డుదారుల ఈకేవైసీ

రేషన్‌ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు సర్కులర్‌ జారీ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది. రేషన్‌ డీలర్లు, తాహసీల్దార్లు, డీఎ్‌సవోలు, కలెక్టర్ల (సివిల్‌ సప్లయిస్‌) లాగిన్‌లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్‌ యాప్‌, రేషన్‌ షాపులోని ఈ-పోస్‌ పరికరాల ద్వారా ఈకేవైసీని అప్‌డేట్‌ చేసుకునే సౌకర్యం ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్‌కార్డుదారులకు భవిషత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేశారు.