Entrance Exams: ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..

విద్యా సంవత్సరం ముగియనున్న తరుణంలో, ఏపీలో ఫైనల్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు త్వరలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో విడుదల చేశారు.


(వ్యవసాయం మరియు ఫార్మసీ పరీక్షలు – మే 19, 20)

(ఇంజనీరింగ్ పరీక్షలు – మే 21 నుండి 27 వరకు)

AP RSET – మే 2 నుండి 5 వరకు

AP ESET – మే 6

AP ISET – మే 7

AP LASET/ PG LSET – మే 25

AP PGESET – జూన్ 5 నుండి 7 వరకు

AP EDSET – జూన్ 8

AP PGSET – జూన్ 9 నుండి 13 వరకు

సంబంధిత పరీక్షలను ఆయా తేదీల్లో నిర్వహిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా ఉండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.