సభ్యులకు కనీస జీవిత బీమా ప్రయోజనాలను అందించడం ప్రధానంగా వచ్చిన మార్పు. ఈ మార్పుల కింద ఇటీవల ఉద్యోగంలో చేరి ఒక ఏడాది సర్వీసులో పో మరణించిన ఉద్యోగులకు కూడా బీమా ప్రయోజనాలు అందుబాటులోకి తెచ్చింది. మరణించిన ఈపీఎఫ్ సభ్యుల కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది. ఈ మార్పులను ఫిబ్రవరి 28, 2025న జరిగిన సమావేశంలో ప్రకటించారు. అలాగే భీమా చెల్లింపులను పెంచడం మరియు కవరేజీని విస్తరించడం ద్వారా ప్రతి ఏడాది వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుక్ మాండవ్య అధ్యక్షత వహించారు. అలాగే ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25% వడ్డీ రేటును కూడా సిఫార్సు చేశారు. లక్షలాదిమంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి. గతంలో ఒక వ్యక్తి ఒక ఏడాది సర్వీసులోపు చనిపోయిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి భీమా ప్రయోజనాలు లభించేది కాదు. ప్రస్తుతం ఈ నియమం మార్చారు. మార్చిన నియమాల ప్రకారం ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి ఏడాదిలోపు మరణిస్తే అతని కుటుంబానికి 50,000 బీమా లభిస్తుంది. ప్రతి సంవత్సరం 5000 కంటే ఎక్కువ కుటుంబాలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక వ్యక్తి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎంప్లాయి డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
ఇది అతి ముఖ్యమైన సామాజిక భద్రత ప్రయోజనంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈపీఎఫ్ సభ్యులు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్లకి మరింత సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈపీఎఫ్ఓ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవంలో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మాండవ్య కీలక ప్రకటన చేశారు. రాబోయే కొత్త వర్షం ద్వారా ఏటీఎం నుంచి తక్షణ పీఎఫ్ విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది.
ఇదివరకటి రోజుల్లో క్లైమ్ చేసిన తర్వాత డబ్బు అకౌంట్ లో పడే వరకు వేచి చూసేవారు. కొత్తగా వచ్చిన ఈపీఎఫ్ఓ 3 పాయింట్స్ ఉన్న వెర్షన్ తో విత్ డ్రాయల్ వెయిటింగ్ పీరియడ్ తగ్గనుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కొత్త ప్లాట్ఫారం బ్యాంకింగ్ సిస్టంకు సమానంగా పనిచేస్తుంది. యూఏఎన్ ద్వారా పండు ట్రాన్స్ఫర్ మరియు క్లైమ్ ట్రాన్స్ఫర్ సేవలు మరింత వేగంగా జరుగుతాయి. ఇప్పుడు కావాలంటే అప్పుడు పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ఉద్యోగులు తమ పిఎఫ్ లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిని పెంచేలా చేస్తుంది.