EPFO Pension: 20 కోట్ల రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల పెన్షన్!

EPFO Retired Private Employees Pension: ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ఎంతో కొంత పెన్షన్ వస్తూ ఉంటుంది. కానీ ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ రావడం చాలా కష్టం. ప్రైవేటు ఉద్యోగం చేసే చాలామంది ఎంతో కొంత పెన్షన్ పొందాలని ఆశిస్తూ ఉండడం కామన్.. ఇందులో భాగంగానే కొంతమంది కొన్ని బ్యాంకులు ఏర్పాటు చేసిన పెన్షన్ పథకాలలో భాగంగా డబ్బులు పెట్టుబడి పెడతారు. కానీ ఇకనుంచి ప్రైవేటు ఉద్యోగులు ఇలా పెన్షన్ కోసం బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టనక్కర్లేదు..
ప్రైవేటు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం మునుముందు అందించబోతోంది.


ఈ పెన్షన్ ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి అందేటట్లు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కార్మిక సంఘాలు ఈ పెన్షన్ కు సంబంధించిన అనేక సిఫారసులను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు. కనీస వయస్సుతో పదవి విరమణ పొందిన వారు ఈపీఎఫ్ ప్రత్యేకమైన పెన్షన్ పథకం కింద పదవీ విరమణ పెన్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనివర్సల్ పెన్షన్ సిస్టంలో భాగంగా పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్తో పాటు అనేక ప్రయోజనాలు పొందుతున్న సంగతి అందరికీ తెలుసు. అయితే ప్రైవేటు ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సిస్టంనే తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

యూనివర్సల్ పెన్షన్ సిస్టం తరహా ప్రైవేటు ఉద్యోగులకు తీసుకువచ్చే పెన్షన్ సిస్టంకు సంబంధించిన విషయాలను గతంలో జరిగిన కేబినెట్ చర్చల్లో ఎన్నోసార్లు చర్చించుకున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మోదీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెట్టి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా తక్కువ జీతాలతో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల వేతనాలను పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మోతాదులో పిఎఫ్ ఖాతాలో డబ్బులు జమవుతాయి.

ఇక ఈ అంశంపై త్వరలో కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. జీతాలు పెంచే కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ ప్రత్యేకమైన ప్రపోజల్సును రెడీ చేసి, ఆర్థిక శాఖకు అందించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనిని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే గుడ్ న్యూస్ వెలుపడే అవకాశాలున్నాయి.

వైరల్ అవుతున్న కొన్ని ప్రపోజల్స్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరి వేతన పరిమితి దాదాపు 21 వేల వరకు పెంచేందుకు కార్మిక శాఖ ఒక ప్రత్యేకమైన ప్రపోజల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఆర్థిక శాఖ ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు భారీ మొత్తంలో పెరుగుతాయి.

ఇక ఈ ప్రపోజల్ కి ఆమోదం వచ్చిన తర్వాత పీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్క పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగి దాదాపు పదివేలకు పైగానే పెన్షన్ పొందగలుగుతాడు. దీనివల్ల భారతదేశంలో రిటైర్మెంట్ పొందిన 20 కోట్ల ప్రైవేటు ఉద్యోగులకు ఈ పెన్షన్ వర్తిస్తుంది..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.