ప్రతి రైతు రైతుగా నమోదు చేసుకోవాలి: ఏఈఓ ప్రతిభ

 ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని ఏఈఓ ప్రతిభ తెలిపారు. వివిధ గ్రామాల్లోని రైతులందరూ రిజిస్ట్రీ చేసుకోవాలని తెలిపారు.


ప్రతి రైతుకు 14 నెంబర్లతో విశిష్ట సంఖ్య కేటాయింపు జరుగుతుందని తెలిపారు. భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యజమాని ఆ వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీ కేటాయిస్తారన్నారు. రెవెన్యూ శాఖ వద్ద భూ యాజమాన్య వివరాలు ప్రమాణికంగా ఈ రైతులకు ఫార్మర్ ఐడీ కేటాయిస్తారన్నారు.

కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రీ అనుసంధానం చేస్తారని తెలిపారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడుత లబ్ధి పొందుటకు పహాని ఫార్మర్ లిస్టులో తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు అయినా రైతు రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదన్నారు. రైతు విశిష్ట సంఖ్యను ఫార్మర్ ఐడీ పొందుటకు మీ ఆధార్, భూ యజమాని పాస్ పుస్తకం ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారిని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్టర్ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.