‘ఇది అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా’.. స్టార్ హీరో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సుధామూర్తి

న్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి ఒక పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందన్నారు. ఈ సమాజంలో పెను మార్పులు తీసుకురాగలదని అభిప్రాయపడ్డారు.


అందరూ తప్పకుండా ఈ ను చూడాలని కోరారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ ప్రీమియర్ ను ఇటీవల ప్రదర్శించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. అందులో సుధా మూర్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో చూసిన అనంతరం ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఈ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులుగా బాధపడుతున్న పిల్లల ఆలోచనలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలను ఈ మూవీలో చక్కగా చూపించారు. ఈ చిత్రం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ ను తప్పకుండా చూడాలి . ఈ సమాజంలో చాలా మార్పు తీసుకురాగలదు” అని సుధా మూర్తి పేర్కొన్నారు.

సుధా మూర్తి ప్రశంసలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో విడుదలకు ముందే ఈ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. ఇలా సుధా మూర్తి మన్ననలు అందుకున్న ఆ మూవీ మరేదో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్.
ఆర్‌ఎస్‌ ప్రసన్న తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో జెనీలియా కథానాయికగా నటించింది. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకు ముందే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఈ మూవీ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. సుధా మూర్తి కూడా హాజరై ఈ ను వీక్షించారు. అనంతరం అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి, అందులోనూ సుధా మూర్తి నోటి వెంట ఈ పేరు వచ్చిందంటే అందులో కచ్చితంగా మంచి విషయం ఉన్నట్లే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.