Blood Tests : మీరు ఆరోగ్యంగానే ఉన్నారా? ప్రతిఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైన ఈ 6 రక్త పరీక్షలు తప్పక చేయించుకోవాల్సిందే!

www.mannamweb.com


Blood Tests : రక్త పరీక్ష ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫిక్షన్ సోకినప్పుడు లక్షణాల ఆధారంగా వైద్యులు కొన్ని రక్త పరీక్షలను సిఫార్సు చేస్తుంటారు. పరీక్ష ఫలితాల ఆధారంగా చికిత్స అందిస్తారు. అయితే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని నిర్ధారించడానికి రక్త పరీక్షలు చాలా ముఖ్యం.

అయితే, చాలామంది ఈ రక్త పరీక్షలను ఎప్పుడో ఏదో అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చేయించుకుంటారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను ముందుగా గుర్తించడానికి వీలుండదు. అందుకే ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఏడాదిలో ఒకసారి కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులోనూ రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. మీకు షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ముందస్తు పరిస్థితులు ఉన్నట్లయితే.. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్ష తప్పనిసరిగా చేయాలి.

అంతేకాదు.. ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలను ఏడాదిలో కనీసం రెండు సార్లు చేయించుకోవాలి. అందులో ప్రధానంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ (CBC), మెటాబాలిక్ ప్యానెల్ (MP), లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ (Lipid Profile Panel), కార్డియాక్ బయోమార్కర్, విటమిన్ డి (Vitamin D), థైరాయిడ్ ప్యానెల్ (Thyroid Profile) టెస్టులను చేయించుకోవాలి.

కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష :
కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష (CBC) శరీరంలోని ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌ల స్థితిని సూచిస్తుంది. రక్తహీనత, రక్త క్యాన్సర్ వంటి ఇన్ఫెక్షన్లను గుర్తించడంలోనూ ఈ పరీక్ష సాయపడుతుంది.

మెటాబాలిక్ ప్యానెల్ :
ప్రాథమిక మెటాబాలిక్ ప్యానెల్ టెస్టు ద్వారా మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ స్థితిని ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అంచనా వేయొచ్చు. ఈ పరీక్ష శరీరంలోని పొటాషియం, సోడియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్‌లతో సహా మీ మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. అధిక బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ :
ఈ రక్తపరీక్షకు ఫాస్టింగ్ తప్పనిసరి. లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ టెస్టు ద్వారా మీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను చెక్ చేసుకోవచ్చు. ఈ ప్యానెల్ బోర్డర్ లెవల్స్ లేదా అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

కార్డియాక్ బయోమార్కర్స్ :
మీ శరీరంలో ఎంజైమ్ స్థాయిలను తప్పనిసరిగా చెక్ చేయండి. హెల్త్‌లైన్ ప్రకారం.. ఎంజైమ్‌లు ప్రోటీన్లతో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, రక్తం గడ్డకట్టడం వంటి వివిధ రసాయన ప్రక్రియలను పూర్తిచేయడంలో శరీరానికి సాయపడతాయి.

విటమిన్ డి లెవల్స్ :
విటమిన్ డి లెవల్స్ తగినంతగా ఉండాలి. లేదంటే.. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ విటమిన్ డి స్థాయిలను టెస్టు ద్వారా నిర్ధారించవచ్చు. విటమిన్ డి సాధారణం కన్నా తక్కువగా ఉంటే దాన్ని లోపంగా పరిగణిస్తారు.

థైరాయిడ్ లెవల్స్ పరీక్ష :
థైరాయిడ్ పరీక్షతో మీ థైరాయిడ్ గ్రంధి హైపర్యాక్టివిటీ లేదా అండర్ యాక్టివిటీలో ఉందో లేదో నిర్ధారిస్తుంది. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH)ను సూచిస్తుంది. థైరాయిడ్ హర్మోన్ పనితీరు సరిగా లేదని తేలితే.. అందుకు అవసరమైన చికిత్స కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించవచ్చు.