Eye Sight : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలా మంది కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వం పెద్ద వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా రావడాన్ని మనం చూడవచ్చు.
పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
కొందరిలో జన్యుపరంగా కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది కళ్లద్దాలే ఈ సమస్యకు పరిష్కారం అని భావిస్తారు. కానీ ఇంటి చిట్కాను ఉపయోగించి కూడా మనం కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు.
కంటి చూపును మెరుగుపరిచే ఇంటి చిట్కా ఏమిటి.. దీనిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
ఈ చిట్కాను పాటించడానికి మనం బాదం పప్పును, సోంపూ గింజలను, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా బాదం పప్పును నీటిలో నానబెట్టాలి. బాదం పప్పు నానిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీయాలి. ఇప్పుడు ఈ బాదం పప్పును జార్ లో వేసి పొడి గా చేసుకోవాలి.
Eye Sight
తరువాత సోంపు గింజలను కూడా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ బాదం పొడిని, అర టీ స్పూన్ సోంపు గింజల పొడిని వేసి కలపాలి. రుచి కొరకు దీనిలో పట్టిక బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. అలాగే ఈ పాలను తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
ఈ విధంగా తయారు చేసుకున్న పాలను నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బాదం పప్పులో , పాలల్లో, సోంపూ గింజల్లో ఉండే పోషకాలు కంటిచూపును మెరుగుపరచడంలో మనకు ఎంతో సహాయపడతాయి.
ఈ చిట్కాను పాటిస్తూనే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, సెల్ ఫోస్ వంటి పరికరాలను తక్కువగా ఉపయోగించడం వల్ల వంటి చేయాలి.
దీంతో మన కంటి చూపు మెరుగుపడడమే కాకుండా భవిష్యత్తులో కూడా కంటిచూపుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.