Father and son died after pet dog attack in vizag: చాలా మంది కుక్కలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. మనుషుల కన్నా..కొందరు నోరులేని జీవాలే బెటర్ అని భావిస్తుంటారు.
అందుకే కుక్కలను తమ ఇళ్లలో ఇష్టంతో పెంచుకుంటారు. వాటిని తమ ఇళ్లలోని మనుషుల మాదిరిగా ట్రీట్ చేస్తారు. మంచి ఫుడ్ ఇస్తారు. రెగ్యులర్ గా వాకింగ్ లకు తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా.. వెటర్నరీ వైద్యుల దగ్గరకి తీసుకెళ్లి డీవార్మింగ్ కూడా చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుక్కలు కూడా తమ యజమానుల పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. తమ ఓనర్ ను వదిలి అస్సలు ఉండవు. ఇతరులు ఏదైన తినడానికి పెడితే అస్సలు ముట్టుకొవు.
తమ యజమాని కన్పించకపోతే.. తినడంకూడా మానేస్తుంటారు. అంతగా శునకాలు, మనుషులతో ఎమోషన్ గా కనెక్ట్ అయి ఉంటాయి. మరోవైపు.. కుక్కలను పెంచుకోవడం వల్ల మన శరీరంలోని ఒత్తిడిలు, అనేక రుగ్మతలు కూడా తగ్గిపోతాయని కూడా నిపుణులు చెబుతుంటారు. కానీ శునకాలను పెంచడంతో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని మాత్రం సూచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కుక్కలు వింతగా ప్రవర్తిస్తుంటాయి. బైట వారిమీద కాకుండా.. ఇంట్లో వాళ్ల మీద కూడా దాడులకు పాల్పడుతుంటాయి.ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
విశాఖ పట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం చోటుచేసుకుంది. నరసింగరావు తన ఇంట్లో కొన్నేళ్లుగా కుక్కలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమైందో కానీ.. కొన్నిరోజుల క్రితం..నరసింగరావు(59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్‌ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు.
కానీ అప్పటికే.. వారిలో కూడా కొన్ని హెల్త్ కండీషన్ కూడా పాడైనట్లు తెలుస్తోంది. వారిలో కూడా.. మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ తండ్రి,కొడుకులు మరణించారు.ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్రకలకలంగ మారింది. కుక్క కరవగానే.. గ్యాప్ ఇవ్వకుండా యాంటి రేబిస్ తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కలకు కూడా క్రమంతప్పకుండా.. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.