FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల సవరణ… ఆ బ్యాంకు ఖాతాదారులకు ఇక పండగే..!

www.mannamweb.com


భారతదేశంలో నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఎఫ్‌డీలు బాగా ప్రాచుర్యం పొందాయి. స్థిర ఆదాయం ఇచ్చే ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడితే తమ సొమ్ము భద్రంగా ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ నమకాన్ని నిలబెట్టుకుంటూ భారతదేశంలో అన్ని ఎఫ్‌డీలపై ప్రత్యేక వడ్డీలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక కీలక వడ్డీ రేట్లను సవరించాయి. అలాగే సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీను అందిస్తున్నాయి. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. ఎస్‌బీఐ, డీసీబీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వడ్డీ రేట్లను సవరించాయి. కాబట్టి ఈ బ్యాంకుల్లో తాజా సవరణ తర్వాత ఎఫ్‌డీలపై ఎంత స్థాయిలో వడ్డీను సవరించాయో? ఓ సారి తెలుసుకుందాం.

డీసీబీ బ్యాంక్‌
డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది . డీసీబీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. 19 నెలల నుంచి 20 నెలల కాలవ్యవధిలో రివిజన్ తర్వాత సాధారణ కస్టమర్లకు 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55 శాతం అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8 శాతం వరకు అందించబడుతుంది. ఈ పెద్ద బ్యాంక్ ఇప్పుడు పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మే 15, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. మార్పు తరువాత బ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌ల కోసం పైన పేర్కొన్న రేటు కంటే బ్యాంక్ 0.50 శాతం పీఏ అదనపు స్ప్రెడ్‌ను అందిస్తుంది. వడ్డీ రేటు 3.50 శాతం నుంచి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8 శాతం, 8.40 శాతం వడ్డీ అందిస్తారు.