FIXED DEPOSIT | రిస్క్‌ లేని సంపాదన కోసం ఎఫ్‌డీ బెటర్.. అధిక వడ్డీలిచ్చే స్కీమ్‌లివే

FIXED DEPOSIT | స్టాక్‌ మార్కెట్‌(STOCK MARKET)లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. ఇందులో సంపద అతి తక్కువ కాలంలోనే పెరిగే అవకాశాలుండడంతోపాటు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదాలూ ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లలో fixed deposits రిస్క్‌ తక్కువ.. అలాగే రివార్డూ తక్కువే.. అయితే ఉన్నవాటిలో కాస్త బెటర్‌గా ఎక్కువ వడ్డీ ఇచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లు fixed deposit schemes కూడా ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో ఆయా స్కీమ్‌లపై బ్యాంకులు వడ్డీ రేట్లను interest rates తగ్గించబోతున్నాయి. ఆసక్తిగలవారు త్వరపడి ఈనెలాఖరులోగా ఆయా స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టేయంది. అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న ఎఫ్‌డీ(FD) స్కీమ్‌లేమిటో తెలుసుకుందామా..


SBI అమృత్‌ వృష్టి..
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమృత్‌ వృష్టి పేరిట ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ fixed deposit scheme అందిస్తోంది. దీని కాలవ్యవధి 444 రోజులు. దీనిపై 7.25 శాతం వడ్డీ ఇస్తుంది. కాగా సీనియర్‌ సిటిజన్లకు(SENIOR CITIZENS) మాత్రం 7.75 శాతం వడ్డీ చెల్లిస్తుంది.

SBI అమృత్‌ కలశ్‌
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమృత కలశ్‌ Amrut Kalash పేరుతో మరో FD స్కీమ్‌ కూడా అమలు చేస్తోంది. 400 రోజుల వ్యవధిగల ఈ స్కీమ్‌లో 7.1 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఇందులోనూ సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ అందుతుంది.

IDBI ఉత్సవ్‌ ఎఫ్‌డీ
ఐడీబీఐ బ్యాంక్‌ IDBI Bank ఉత్సవ్ ఎఫ్‌డీపై అధిక వడ్డీని చెల్లిస్తోంది. 555 రోజుల వ్యవధితో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై గరిష్టంగా 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ ఇస్తోంది.