School Holiday: ఫిబ్రవరి 14 ఆ పాఠశాలలకు సెలవు.. ఆ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు.

షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 14న షబ్-ఎ-మెరాజ్ సెలవు దినంగా ప్రకటించినప్పటికీ, దీనిని సాధారణ సెలవు దినాలలో కాకుండా ఐచ్ఛిక సెలవు దినాలలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ షబ్-ఎ-మెరాజ్ పవిత్ర దినం.


ఈ సందర్భంగా, మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా ప్రార్థనలు చేస్తారు. ఇస్రా మరియు మెరాజ్ కథను వివరిస్తారు. ఫిబ్రవరి 14 సాధారణ సెలవు దినం కానప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలకు శుక్రవారం (ఫిబ్రవరి 14) సెలవు ఉంటుంది. సాధారణంగా, రాష్ట్రంలోని మైనారిటీ విద్యా సంస్థలు షబ్-ఎ-మెరాజ్ తర్వాత రోజు సెలవును పాటిస్తాయి.