ఆడవాళ్లు తమ మొత్తం జీవితంలో శారీరకంగా మరియు మానసికంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తారు. వాటిని ఎదుర్కొని నిలబడాలంటే ఆరోగ్యమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.
అయితే ఆడవారికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో అవిసె గింజలు( Flax Seeds ) ఒకటి. అవిసె గింజలు ఆడవారికి ఒక వరమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవిసె గింజలు నిత్యం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్( Weight Loss ) తో సహా ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ అవిసె గింజలు వేసుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ ఈ గింజలను దోరగా వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న అవిసె గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి మరియు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి.లేదా ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి( Flax Seeds Powder ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తినవచ్చు. ఇలా ఎలా తీసుకున్నా కూడా అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఆడవారు తమ డైట్ లో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల చాలా లాభాలే పొందుతారు. అవిసె గింజల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ), యాంటీ ఆక్సిడెంట్స్ మెలబాలిజం రేటును పెంచుతాయి. వెయిట్ లాస్( Weight Loss ) ను ప్రమోట్ చేస్తాయి. అలాగే అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్లను సమతుల్యం( Hormonal Imbalance ) చేస్తాయి. నెలసరి సమస్యలను దూరం చేస్తాయి.
సక్రమంగా పీరియడ్స్ వచ్చేలా ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ ను అవిసె గింజలు తగ్గిస్తాయి. ఎముకలను, కండరాలను బలంగా మారుస్తాయి. జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి సైతం అవిసె గింజలు అండంగా ఉంటాయి