పుల్లట్టు పేరు ఎప్పుడైనా విన్నారా? పూర్వం పల్లెటూర్లలో షాపులలో రూపాయికి నాలుగు పుల్లట్లు ఇస్తుండేవాళ్లు. చాలా చాలా టేస్టీగా ఈ పుల్లట్లు తింటూ ఉంటే ఎన్నైనా అలా పోతూ ఉంటాయి.
ప్రస్తుతం సిటీల్లో రోడ్డు పక్కన బండ్లమీద కూడా పుల్లట్లు అమ్ముతున్నారు. ఈ పాతకాలం నాటి పుల్లట్టుని మీరు కూడా మీ ఇంట్లో చేయాలనుకుంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పుల్లట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పుల్లట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రేషన్ బియ్యం
-పెరుగు
-మజ్జిగ
-ఉప్పు
-జీలకర్ర
పుల్లట్టు తయారీ విధానం
-ముందుగా రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో 1 కప్పు పెరుగు,అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి కనీసం 3 గంటలు నానబెట్టాలి.
-తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసి పిండిని ఓ గిన్నెలో వేసుకోవాలి. పిండి దోశ పిండి కన్నా ఇంకా కొంచెం పలుచగానే ఉండాలి.
-ఇప్పుడు పిండిలో కొంచెం నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలిపి మూతపెట్టి 1 గంటసేపు పక్కనపెట్టుకోండి
-తర్వాత పిండి పులుస్తుంది. అప్పుడు పెనం మీద దోశలుగా వేసుకోవడమే. అంతే పుల్లట్టు రెడీ. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండానే మందంగా దోశెలు పోసుకోవచ్చు.