బీరకాయతో కరకరలాడే “గారెలు” – అమ్మవారికి ప్రసాదంగానూ పెట్టొచ్చు! – నూనె పీల్చవు!

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కరకరలాడే స్నాక్స్ తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ నెక్ట్​ లెవల్​లో ఉంటుంది. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ రొటీన్​గా పకోడీ, బజ్జీ, పునుగులు, గారెలు వంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ అవే తినాలన్నా బోరింగ్​గా ఉంటుంది. అందుకే, మీకోసం ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. అదే, కరకరలాడే “బీరకాయ గారెలు”. నార్మల్​గా గారెలు అందరూ చేసుకునేవైనా ఇవి కొంచెం ప్రత్యేకంగా ఉండి సరికొత్త రుచినిస్తాయి. వీటిని స్నాక్​గానే కాకుండా దేవీ శరన్నరాత్రులు కొనసాగుతున్న వేళ అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యంగానూ ప్రిపేర్ చేసి నివేదించవచ్చు. ఇవి నూనెను తక్కువగానే పీల్చుకుంటాయి! ఎవరైనా చాలా తక్కువ టైమ్​లో సింపుల్​గా చేసుకోవచ్చు. మరి, బీరకాయతో ఈ క్రిస్పీ అండ్ టేస్టీ గారెలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

  • రెండు కప్పులు – మినప్పప్పు
  • రెండు – ఉల్లిపాయలు
  • రెండు – బీరకాయలు
  • ఏడెనిమిది – పచ్చిమిర్చి
  • రెండు అంగుళాల ముక్క – అల్లం
  • నాలుగు రెబ్బలు – కరివేపాకు
  • నాలుగు చెంచాలు – నువ్వులు
  • రుచికి తగినంత – ఉప్పు
  • వేయించడానికి సరిపడా – నూనె
  • తయారీ విధానం :

    • ఈ రెసిపీని ఉదయం అమ్మవారి ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వారు ముందు రోజు రాత్రి మినప్పప్పును శుభ్రంగా కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
    • అదే, మీరు ఈవెనింగ్ టైమ్ స్నాక్​గా రెడీ చేసుకోవాలనుకుంటే మాత్రం మార్నింగ్ శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది.
    • మినపప్పు బాగా నానిన తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడకట్టాలి. అనంతరం మిక్సీ జార్​లోకి తీసుకుని ఎక్కువ నీళ్లు వేయకుండా కాస్త గట్టిగానే ఉండేలా పిండిని మిక్సీ పట్టుకోవాలి.
    • ఇప్పుడు బీరకాయలను పీలర్​తో చెక్కు తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై గ్రేటర్​తో సన్నగా తురుమి చేతితో ఒకసారి పిండి అందులో నుంచి వచ్చే వాటర్​ని వడకట్టేయాలి.
    • అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంలను వీలైనంత సన్నగా తురుమి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న మినప్పప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న బీరకాయ తురుము, సన్నని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు తరుగు, సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
  • అలాగే, రుచికి తగినంత ఉప్పు, నువ్వులు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి హీట్ చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక మంటను తగ్గించి చేతికి కొన్ని నీళ్లు రాసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న మినప్పిండిలో కొద్దికొద్దిగా తీసుకుంటూ గారెల మాదిరిగా వత్తుకుని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
  • కడాయిలో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా కాసేపు కాలనిచ్చి ఆపై చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పేస్తూ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • నూనెలో బబుల్స్ తగ్గి అవి మంచిగా వేగాయనుకున్నాక టిష్యూపేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకుని అరనిమిషం పాటు ఉంచి ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, బీరకాయతో కరకరలాడే “గారెలు” రెడీ అవుతాయి!
  • తర్వాత వీటిని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి లేదా అల్లం చట్నీతో కలిపి సర్వ్ చేశారంటే ఆ రుచి అద్దిరిపోతుంది.
  • పండగ వేళ ఇలా చేసి పెట్టారంటే పిల్లలతో పాటు పెద్దలు వీటిని చాలా ఎంజాయ్ చేస్తారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.