Gas Bookings : వాట్సాప్ లో గ్యాస్ బుకింగ్స్..అదరగొడుతున్న కొత్త ఫీచర్!
ఈమధ్య సరికొత్త ఫీచర్స్ తో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్న వాట్సాప్, ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. సాధారణంగా మనం గ్యాస్ ని బుక్ చేసుకోవాలంటే సంబంధిత ఏజెన్సీ నెంబర్ కి కాల్ చేసి బుక్ చేస్తుంటాం.
లేదా ఆ ఏజెన్సీ కార్యాలయం లో వెళ్లి బుక్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ బుకింగ్ సర్వీస్ ని జనాలకు మరింత సులభం అయ్యేలా ప్లాన్ చేసింది వాట్సాప్. వాట్సాప్ ద్వారా మీరు గ్యాస్ ని బుక్ చెయ్యాలంటే ముందుగా మీరు పలు ఏజెన్సీలకు సంబంధించిన నంబర్స్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోవాలి. హెచ్ పీ గ్యాస్ – 9222201122,ఇండియన్ గ్యాస్ – 7588888824,భారత్ గ్యాస్ – 1800224344. ఈ నంబర్స్ ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా బుక్ చేసే ఏజెన్సీ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజి చెయ్యండి.
ఆ తర్వాత వెంటనే మీకు బాషాని ఎంచుకోమని రిప్లై వస్తుంది. మనకి కావాల్సిన బాషని ఎంచుకున్న తర్వాత గ్యాస్ బుకింగ్ కి కావాల్సిన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి కావాల్సిన ఆప్షన్ ని ఎంచుకుంటే గ్యాస్ బుక్ అయిపోయినట్టే. ఆలస్యం చెయ్యకుండా గ్యాస్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే మీ వాట్సాప్ ని ఓపెన్ చేసి , పైన చెప్పినట్టు ఫాలో అయిపోండి.