Maruti Swift: లీటర్ పెట్రోల్ పోసి 30 కిలోమీటర్లు తిరగొచ్చు.. మిడిల్ క్లాస్ కు బెస్ట్ కారు ఇదే..

Maruti Swift: లీటర్ పెట్రోల్ పోసి 30 కిలోమీటర్లు తిరగొచ్చు.. మిడిల్ క్లాస్ కు బెస్ట్ కారు ఇదే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Maruti Swift: ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు కనిపించేవి. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా కార్లలో తిరగాలని ఆరాటపడుతున్నారు. ఈ తరుణంలో బడ్జెట్, మెయింటనెన్స్ ను దృష్టిలో ఉంచుకొని తమకు అవసరమైన వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన కొన్ని కార్ల కంపెనీలు మధ్య తరగతి వారి బడ్జెట్ కు అనుగుణంగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. అటు ఉన్నత వర్గాలకు అవసరమైన ఫీచర్స్ ను అమరుస్తున్నాయి. ఇలా అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ.. తక్కువ ధరకు మంచి కార్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఓ కారు అందుబాటులోకి రాబోతుంది. ఇది ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నా.. లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ తో రెడీ అవుతోంది. ఇంతకీ ఆ కారు గురించి తెలుసా?

నేటి కాలంలో కారు కొనడం పెద్ద విషయమేమి కాదు. ఎందుకంటే ఆటోమోబైల్ మార్కెట్లో పోటీ కారణంగా చాలా కంపెనీలు తక్కువ ధరకే కార్లను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కేవలం మిడిల్ క్లాస్ ను బేస్ చేసుకొని మారుతి సుజుకీ కంపెనీ వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి చెందిన ఎన్నో కార్లను వినియోగదారులు ఆదరించారు. వారికి అనుగుణంగా కంపెనీ సైతం తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేస్తూ వస్తోంది. తాజాగా ఓ కారును అప్డేట్ చేసి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

Related News

మారుతి నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన స్విప్ట్ గురించి కారున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గత రెండు సంవత్సరాలు ఈ మోడల్ అమ్మకాల్లో ముందంజలో ఉంటోంది. 2023 సంవత్సరంలో కూడా 2 లక్షలకు పైగా విక్రయాలు జరుపుకొని బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే ఈ మోడల్ ను 2024లో అప్డేట్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్ కారుగా ఉన్న దీనిని ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్ తో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

కొత్తగా వచ్చే స్విప్ట్ లో 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్ జీ వేరియంట్ తో పాటు రెండో ఇంజిన్ 1.2 లీటర్ పెట్రోల్ ఉంటుంది. ఈ బాహుబలి ఇంజిన్ కారణంగా లీటర్ పెట్రోల్ తో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.మైలేజ్ మాత్రమే కాకుండా ఇందులో అప్డేట్ ఫీచర్స్ ను అమర్చనున్నారు. ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఏసీ వెంట్స్, డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్ ను అమర్చారు. అలాగే డ్యూయల్ టోన్ కలర్ థీమ్ ను కొత్త కారులో చూడొచ్చు. ఇక ఈ కారులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పార్కింగ్ కోసం సెన్సార్ కెమెరా, 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్ 6 వే అడ్జస్టబుల్ సీట్లు ఇందులో కనిపిస్తాయి.

సాధారణ స్విప్ట్ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించారు. కొత్తగా వచ్చే స్విప్ట్ రూ.14 లక్షలతో అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటించకపోయినా కంపెనీ ప్రకటనను బట్టి కారు ఫీచర్స్ లీక్ అయ్యాయి. ధర, మైలేజ్ తో పాటు బెస్ట్ ఫీచర్స్ ఉండడంతో మరోసారి బాహుబలి స్విప్ట్ అమ్మకాలు ఊపందుకుంటాయని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *