రోజూ వంట చేయడం వల్ల గ్యాస్ బర్నర్ జిడ్డుగా మారుతుంది. దీనిని శుభ్రపరచడం చాలా కష్టం. ఎంత శుభ్రం చేసిన జిడ్డు వదలదు. అయితే ఈ ఒక్క ట్రిక్ ద్వారా గ్యాస్ బర్నర్‌ను సులువుగా శుభ్రంచేయవచ్చు.
గ్యాస్ బర్నర్ జిడ్డును సులభంగా తొలగించాలంటే.. ముందుగా గ్యాస్ ఓవెన్ నుండి గ్యాస్ బర్నర్‌ను తీసివేసి, చల్లబరచండి. వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయకూడదు.
ఇప్పుడు శుభ్రం చేయడానికి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాని కోసం ఒక పెద్ద గిన్నెలో వేడి నీటిని తీసుకొని, అందులో బేకింగ్ సోడా, వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గ్యాస్ బర్నర్ మునిగిపోయేలా వేయాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్‌ను సుమారు 30-60 నిమిషాల పాటు నానబెట్టాలి.
మురికి ఎక్కువగా ఉంటే, కొంచెం ఎక్కువ సేపు నానబెట్టవచ్చు. తర్వాత, మృదువైన స్పాంజ్ లేదా బ్రష్‌ని ఉపయోగించి గ్యాస్ బర్నర్‌ను స్క్రబ్ చేస్తే మురికి పూర్తిగా వదిలిపోతుంది.
దీనితో పేరుకుపోయిన మురికిని సులభంగా తొలగించవచ్చు. చివరగా గ్యాస్ బర్నర్‌ను శుభ్రమైన నీటితో కదిగి పొడి గుడ్డతో తుడి చేస్తే సరి.
అప్పటికీ గ్యాస్ బర్నర్ తళతళ మెరిసిపోకపోతే నిమ్మకాయ ముక్కతో దానిని బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బర్నర్ కొత్తదిలా కనిపిస్తుంది. ఇలా చేస్తే ఎంతటి కఠినమైన మురికైనా క్షణాల్లో వదలిపోతుంది.