ఆదివారం వచ్చిందంటే చాలు అందరూ మటన్ షాపులు, చికెన్ షాపుల ముందు క్యూలో నిలబడతారు. ఆరోజు కచ్చితంగా మాంసాహారం తినాల్సిందే. ఇందులో రకరకాలుంటాయి. కొందరు లివర్ తింటే మరికొందరు ఎముకలు లేకుండా, మరికొందరు కేవలం ఎముకలే తింటుంటారు. అలాగే కొందరు మేక గుండెకాయను తింటారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలను అందించగలదు.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది మేక గుండెకాయలో మంచి ప్రోటీన్ ఉంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు కండరాల అభివృద్ధి కోసం తోడ్పడుతుంది. గుండెకాయలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. మనిషి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, శరీర దృఢత్వానికి మంచివి. విటమిన్ B12 దొరుకుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థకు, కండరాల పనితీరుకు సాయపడుతుంది. మేక గుండెకాయలో ఐరన్ కూడా ఉంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు సహాయపడుతుంది. అనీమియా నివారణకు తోడ్పడుతుంది. గుండెకాయలో ఉండే పోషకాలు, ముఖ్యంగా ఫాస్ఫరస్, జింక్, మెదడును ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మాంసంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మాంసంలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కూడా గుండె జబ్బులకు కారణమవుతాయి.
శుభ్రపరచకపోతే అనారోగ్యం అయితే వండుకునేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేక గుండెకాయను పద్ధతిగా శుభ్రపరచకపోతే, బ్యాక్టీరియా లేదా పరాసైట్ సంక్రమణలు కలుగుతాయి. గుండెకాయలలో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అధిక కొవ్వు ఉన్న ఆహారం వాడుతున్న వారిలో కొంతమందికి ఆరోగ్య సమస్యలు సృష్టించవచ్చు. ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇబ్బందికరంగా మారుతుంది. దీనిని అధికంగా తినడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. మితిమీరిన మోతాదులో తీసుకోకుండా ఉండటం ఉత్తమం. కొంతమందికి మేక గుండెకాయను తినడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే, దీనిని మొదటిసారి తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.