Gold seized: ఎన్నికల వేళ 1425 కేజీల (విలువ 900 కోట్లు బంగారం సీజ్.. ఎక్కడ?

www.mannamweb.com


Gold seized: ఎన్నికల వేళ నగదు, నగల ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఆపాల్సిందేనని భావించింది. అన్నట్లుగా చెక్ పోస్టులను భారీగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది. తాజాగా తమిళనాడులో భారీ ఎత్తున పసిడి పట్టుబడింది. ఒక్కరోజులో దాదాపు 1025 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు.

తొలుత మిని లారీ, మినీ కంటెయినర్లను సోదాలు చేశారు పోలీసులు. ఓ లారీలో దాదాపు 1025 కేజీ గోల్డ్ పట్టుబడింది. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలోకి ఓ గోడౌన్‌కు తరలిస్తున్నట్లు తేలింది. అయితే 400 కేజీల బంగారానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అయితే లారీలో స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించిన ఆధారాలు లేనట్లు సమాచారం. వీటి విలువ మార్కెట్‌లో 900 కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారుల అంచనా.

కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ రహదారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీల్లో ఈ బంగారం వ్యవహారం బట్టబయలైంది. దీంతో తమిళనాడు అంతటా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మెహరించారు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. మరో నాలుగురోజుల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 39 నియోజక‌వర్గాలు ఈ ఫేజ్‌లోనే ఉన్నాయి. పోలింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అక్కడ ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ కూత మొదలు ఇప్పటికే అత్యధిక బంగారం పట్టుబడింది కేవలం దక్షిణాదిలో మాత్రమే.