Gond Katira Benefits: గోండు కటీర గురించి విన్నారా..? ఊహించని ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

www.mannamweb.com


Gond katira: గోండు కటీర లేదా గోధుమ బంక గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇదొక జిగురు లాంటి ఆయుర్వేద ఔషధం. ఇది తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. ఇది నీటిలో కరిగినప్పుడు మెత్తగా ఉబ్బి మృదువుగా మారుతుంది. గోధుమ బంకను నీళ్లలో కలుపుకొని తాగొచ్చు. లేదంటే నిద్రపోయే ముందు వేడి పాలలో వేసుకొని తాగొచ్చు. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.100 గ్రాముల గోధుమ బంక లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎలాంటి వాసన, రంగు లేనిది. కాబట్టి, దీన్ని నిమ్మరసం, లేదంటే షరబత్, శీతల పానీయం వంటి వాటితో కలిపి తాగొచ్చు. ఈ గోధుమ బంకలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

గోండు కటీర, లేదా గోధుమ బంకను జీవక్రియను పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం నివారించడానికి ఉపయోగపడుతుంది. మధుమేహం చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఎముకల దృఢత్వానికి, శరీరం నుండి టాక్సిన్లను తొలగించటానికి మలబద్ధం నివారణకు గోధుమ బంక సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లను కలిగించే వైరస్, బ్యాక్టీరియాలతో శరీరం పోరాడేందుకు శక్తినిస్తుంది.

ఆడవారికి గోండు కటిరా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. అలాంటి వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో కూడా పాల ఉత్పత్తిని ఇది బాగా పెంచుతుంది. తల్లులకు అవసరమైనటువంటి క్యాల్షియన్ని ప్రోటీన్స్‌ని అందిస్తుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని దృఢంగా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ గోండు కటీర చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు ముడతలు రాకుండా చర్మానికి మంచి మెరుపునిస్తుంది. స్పాట్ డిటెక్షన్, గాయం నయం అవడానికి కూడా ఉపయోగపడుతుంది.

గోధుమ బంక వల్ల జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. జుట్టు బలంగా, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ గోధుమ బంకలో ఎక్కువగా ఉండే క్యాల్షియం ప్రోటీన్స్ కంటెంట్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.

చాలా మంది గోధుమ బంకను బరువు నియంత్రించడానికి రకరకాలుగా వాడుతూ ఉంటారు. గోండు కటిరా వాడడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో అధిక బరువుని కూడా నియంత్రిస్తుంది అంతేకాకుండా శరీరంలో నుంచి టాక్సీలను తొలగించి, మూత్రనాల శుద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది.